యాప్నగరం

బంగారం భగభగ.. 7 ఏళ్ల గరిష్టానికి ధర..!

బంగారం ధర పరుగులు పెడుతోంది. మళ్లీ కొండెక్కి కూర్చుంది. కొత్త గరిష్ట స్థాయికి చేరింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నడుమ బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Samayam Telugu 11 Aug 2020, 10:55 am
బంగారం ధర పరుగులు పెడుతోంది. మళ్లీ కొండెక్కి కూర్చుంది. కొత్త గరిష్ట స్థాయికి చేరింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నడుమ బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Samayam Telugu gold rate today hits record high silver prices surge
బంగారం భగభగ.. 7 ఏళ్ల గరిష్టానికి ధర..!



gold news et markets

రూ.41,600 పైకి..

దేశీ ఎంసీఎక్స్ మార్కెట్‌లో బుధవారం ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.4 శాతం పెరిగింది. దీంతో 10 గ్రాములకు బంగారం ధర రూ.41,619కు చేరింది. ఇకపోతే గత సెషన్‌లో బంగారం ధర ఏకంగా రూ.650 పెరిగిన విషయం తెలిసిందే. వెండి ధర కూడా ఈ రోజు 0.7 శాతం పెరుగుదలతో కేజీకి రూ.47,595కు చేరింది.


Also Read: కంపెనీ పీఎఫ్‌ కూడా మీ జీతం నుంచే కట్ అవుతోందా? EPFO రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

అంతర్జాతీయంగా పైపైకి

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ర్యాలీ చేస్తోంది. పసిడి ధర 7 ఏళ్ల గరిష్ట స్థాయికి సమీపంలో కదలాడుతోంది. ఔన్స్‌కు 0.38 శాతం పెరుగుదలతో 1,610.35 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 1 శాతం పెరుగుదలతో 18.32 డాలర్లకు చేరింది.


Also Read: బిర్యానీ బిజినెస్ అదుర్స్.. 2 గంటలు కష్టపడితే.. రోజుకు రూ.5,000 ఆదాయం!

రూ.45,000కు పసిడి పరుగు?

పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.