యాప్నగరం

Gold Rate: బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే.. తులం గోల్డ్ ఎంతుందంటే?

Gold Rate Today: ప్రస్తుత రోజుల్లో బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగానూ చూస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. స్వచ్ఛమైన బంగారం ధర మళ్లీ రూ.61 వేల పైన పలుకుతోంది. వెండి సైతం రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ మహా నగరాల్లో నేటి గోల్డ్, సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 28 Apr 2023, 6:34 am
Gold Rate Today: బంగారం అంటే అందరకీ ఇష్టమే. ఈ విలువైన ఖనిజం తమ వద్ద ఉంచుకోవాలని అంతా భావిస్తుంటారు. భారత్‌లో మహిళలకు దీంతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంగారు ఆభరణాలను ధరిస్తుంటారు. ఇటీవలి కాలంలో మగవారు సైతం ధరిస్తున్నారు. అంతే కాదు బంగారంపై పెట్టుబడులు సైతం పెరుగుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ధరలు స్థిరంగా పెరుగుతుండడమే. ఈ ఏడాది అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా బంగారం కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నా విలువలో మాత్రం క్రితం ఏడాది కన్నా ఎక్కువగానే ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తులం రేటు మళ్లీ రూ.61 వేలు దాటింది. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Samayam Telugu gold rates


హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్లకు రేటు (Gold Price in Hyderabad) క్రితం సెషన్‌తో పోలిస్తే స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు రూ.55 వేల 950 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధరలో సైతం ఎలాంటి మార్పు లేదు. ఇవాళ తులానికి రూ.61 వేల 40 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 55 వేల 100 పలుకుతుండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.61,190 మార్క్ వద్ద ఉంది.

వెండి రేటు (Silver Rate Today) సైతం ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. అయినప్పటికీ రికార్డు స్థాయిల్లోనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఇవాళ రూ.80 వేల 200 మార్క్ వద్ద ఉంది. క్రితం సెషన్‌లో కిలోపై రూ.500 తగ్గిన వెండి ఇవాళ మాత్రం స్థిరంగానే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.76 వేల 500 పలుకుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకు స్థానికంగా ఉండే ట్యాక్సులు, ఇతర అంశాలు కారణమవుతాయి.

గ్లోబల్ బులియన్ మార్కెట్లో చూసినట్లయితే బంగారం ధర కాస్త దిగివచ్చింది. ఇటీవలి కాలంలో స్పాట్ గోల్డ్ రేటు 2 వేల డాలర్ల వరకు చేరిన విషయం తెలిసిందే. అయితే డాలర్ పుంజుకుంటుండడంతో ధరలు పడిపోతున్నాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1987 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.89 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. మన దేశ కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.81.720 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.