యాప్నగరం

శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. పతనమైన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే!

పసిడి రేటు వెలవెలబోయింది. వెండి ధర కూడా పడిపోయింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి.

Samayam Telugu 6 Aug 2021, 6:40 am

ప్రధానాంశాలు:

  • దిగొచ్చిన పసిడి
  • వెండి కిందకు
  • నేటి రేట్లు ఇలా

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold rate
బంగారం ధర వెలవెలబోయింది. పసిడి రేటు పడిపోయింది. బంగారం రేటు దిగొచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధర ఈరోజు పడిపోయింది. పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి రేటు దిగివచ్చింది.
హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.48,880కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.100 తగ్గుదలతో రూ.44,800కు క్షీణించింది.

Also Read: undefined

బంగారం ధర వెలవెలబోతే... వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు రూ.800 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.72,300కు దిగొచ్చింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి.

Also Read: undefined

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. ఔన్స్‌కు 0.27 శాతం పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1803 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా దిగివచ్చింది. ఔన్స్‌కు 0.55 శాతం తగ్గుదలతో 25.12 డాలర్లకు క్షీణించింది.

కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.