యాప్నగరం

Gold Prices Today: నేటి బంగారం ధరలు ఇలా.. ఈ వారం పసిడి రేట్లు ఎలా ఉండొచ్చంటే?

Gold Price Today: బంగారం ధరలు ఈరోజు స్థిరంగానే ఉన్నాయి. పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. పసిడి ప్రేమికులకు ఇది కాస్త ఊరట కలిగించే అంశమనే చెప్పుకోవచ్చు. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా నడిచాయి. సిల్వర్ రేటులో కూడా ఎలాంటి మార్పు లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు ధరలు పైకి కదిలాయి. పసిడి రేటు 0.45 శాతం పెరుగుదలతో ఔన్స్‌కు 1850 డాలర్లకు చేరింది.

Authored byKhalimastan | Samayam Telugu 23 May 2022, 7:10 am

ప్రధానాంశాలు:

  • బంగారం ధరల జోరుకు బ్రేకులు పడ్డాయి
  • పసిడి రేటు స్థిరంగానే కొనసాగుతోంది
  • వెండి ధర కూడా ఇదే దారిలో పయనిస్తోంది
  • గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ జోరు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu latest gold rates in hyderabad
Latest Gold Prices: మూడు రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు మాత్రం శాంతించాయి. పసిడి రేటులో మే 23న ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర (Gold Rate) స్థిరంగానే ఉంది. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ. 47,050, రూ. 51,330 వద్ద కొనసాగుతున్నాయి. బంగారం ధరలు గత మూడు రోజుల కాలంలో రూ. 1000కు పైగా పరుగులు పెట్టాయి. బంగారం ధరలు నిలకడగానే కొనసాగుతూ ఉంటే.. వెండి రేటు (Silver Price) కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధరలో కూడా మార్పు లేదు. సిల్వర్ రేటు కేజీకి రూ. 65,900 వద్దనే ఉంది.
డాలర్ ఇండెక్స్ డైరెక్షన్
రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్ (మెటల్స్ అండ్ ఎనర్జీ రీసెర్చ్) విపుల్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. బంగారం ధరలను ఈ వారం గోల్డ్ రేట్లను డాలర్ ఇండెక్స్ నిర్ణయిస్తుందని తెలిపారు. డాలర్ ఇండెక్స్ కదలికలపై ఆధారపడి బంగారం ధరల మూమెంట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఇటీవల 105 స్థాయికి చేరింది. అయితే ఇప్పుడు 103 స్థాయికి దిగివచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వు బుధవారం రోజున తన లేటెస్ట్ మీటింగ్ మినిట్స్‌ను విడుదల చేయనుందని వివరించారు. దీని ద్వారా తుదుపరి వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన సంకేతాలను గమనించొచ్చని తెలిపారు. అంతేకాకుండా అమెరికా తొలి త్రైమాసికపు జీడీపీ గణాంకాలు కూడా విడుదల కావాల్సి ఉందన్నారు. మే 26న ఈ డేటా విడుదల కావొచ్చు. దీని ద్వారా ఎకానమీ పరిస్థితులను గమనించొచ్చని, దీని ద్వారా బులియన్ మార్కెట్ పయనం డైరెక్షన్ ఉంటుందని తెలిపారు. జీడీపీ గణాంకాలు అంచనాలకు దిగువునే ఉంటే అప్పుడే పసిడి ర్యాలీ కొనసాగనుంది.

Also Read: undefined

రూపాయి కదలికలు
గత వారంలో ఇండియన్ రూపాయి రికార్డ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. దీని ద్వారా బంగారం ధరలకు కలిసొచ్చింది. ర్యాలీ చేశాయి. అయితే రూపాయి బలపడితే.. అప్పుడు బంగారం ధరల పెరుగుదలపై ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇండియన్ రూపాయి, అమెరికా డాలర్ మారక విలువపై కన్నేసి ఉంచాలి. రూపాయి రికవరీ బాట పడితే బంగారంపై ఎఫెక్ట్ ఉంటుంది.

ఇంధన ధరల పెరుగుదల వల్ల అనేది కూడా ముఖ్యమైన అంశమే. ముడి చమురు ధరలు పెరిగితే.. దీని వల్ల బంగారం డిమాండ్ కూడా పైకి చేరుతుంది. ఎందుకంటే బంగారాన్ని హెడ్జ్ సాధనంగా వాడుతారు. రానున్న కాలంలో ముడి చమురు డిమాండ్ పెరగొచ్చని, తద్వారా రేట్లు కూడా పైకి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. చైనాలో లాక్ డౌన్ నిబందనల సడలింపు, రష్యాపై యూపర్ దేశాల ఆంక్షలు ఇందుకు కారణంగా నిలువనున్నాయి.

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.