యాప్నగరం

వామ్మో.. అమాంతం పెరిగిన వెండి.. బంగారం ధర పైపైకి.. ఈరోజు రేట్లు ఇలా!

బంగారం ధర పెరిగింది. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు భారీగా పెరిగింది. సిల్వర్ రేటు ఒక్కసారిగా రూ.1500 పరుగులు పెట్టింది. దీంతో బంగారం, వెండి కొనే వారికి ప్రతికూల ప్రభావం పడనుంది.

Samayam Telugu 21 Jan 2022, 6:22 am

ప్రధానాంశాలు:

  • బంగారం వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్
  • దూసుకెళ్లిన వెండి ధర.. ఒకేరోజు భారీగా పెరిగిన రేటు
  • వెండి రేటు దారిలోనే పయనించిన బంగారం ధర
  • మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో 1840 డాలర్లకు బంగారం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold price today
బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. పసిడి రేటు మెరిసింది. బంగారం ధర పైపైకి కదిలింది. బంగారం ధర జిగేల్ మంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. పరుగులు పెట్టింది. ఒక్కరోజులోనే భారీగా పెరిగిపోయింది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా పసిడి రేటు 1840 డాలర్ల పైన కదలాడుతోంది. వెండి కూడా ఇదే దారిలో పయనిస్తోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 130 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ. 49,200కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 130 పెరిగింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 45,100కు చేరింది.
Also Read: undefined

బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా జిగేల్ మంది. పైపైకి కదిలింది. భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.1500 దూసుకుపోయింది. దీంతో వెండి ధర రూ.67,300కు ఎగసింది. వెండి రేటు పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.15 శాతం క్షీణించింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1840 డాలర్లకు తగ్గింది. వెండి కూడా మాత్రం తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం తగ్గుదలతో 24.18 డాలర్లకు క్షీణించింది.

Also Read: undefined

కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను జీఎస్‌టీ, ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి. ప్రాంతం ప్రాతిపదికన కూడా ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉంటుంది.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.