యాప్నగరం

రూపాయి ఎఫెక్ట్.. రూటు మార్చిన బంగారం ధరలు.. కొనే వారికి బ్యాడ్ న్యూస్

మహిళలకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ, 2 రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేట్లు ఈరోజు మాత్రం పైకి కదిలాయి. దీని వల్ల బంగారం కొనాలని భావించే వారిపై ప్రభావం పడనుంది. అయితే ఇక్కడ అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి రేట్లు పైకి కదలడం గమనార్హం. ఇండియన్ రూపాయి మరింత క్షీణించడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

Authored byKhalimastan | Samayam Telugu 18 May 2022, 6:53 am

ప్రధానాంశాలు:

  • బంగారం ధరల తగ్గదలకు బ్రేకులు పడ్డాయి
  • ట్రెండ్ మార్చిన బంగారం ధరలు.. ఈరోజు పైపైకి
  • బంగారం ధర దారిలోనే పయనించిన వెండి రేటు
  • గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం పడిపోయిన పసిడి ధరలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold prices
బంగారం ధరలు రూటు మార్చాయి. యూటర్న్ తీసుకున్నాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేట్లు ఈరోజు మాత్రం పైపైకి కదిలాయి. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ హైదరాబాద్‌లో మే 18న 10 గ్రాములకు బంగారం ధర రూ. 330 పైకి చేరింది. రూ. 50,780కు ఎగసింది. 24 క్యారెట్ల బంగారానికి ఇది వర్తిస్తుంది. అదేసమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 300 పెరుగుదలతో రూ. 46,550కు ఎగసింది.
గ్లోబల్ మార్కెట్‌లో తగ్గినా..
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో పైకి కదలడం గమనార్హం. ఇండియన్ రూపాయి క్షీణించడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.2 శాతం మేర తగ్గాయి. 1815 డాలర్లకు క్షీణించింది. అలాగే వెండి ధర కూడా 0.36 శాతం క్షీణించింది. ఔన్స్‌కు 21.67 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి రేట్లు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. దేశీ మార్కెట్‌లో సిల్వర్ రేటు కేజీకి రూ. 1100 మేర పరుగులు పెట్టింది. దీంతో వెండి ధర రూ. 65,600కు చేరింది. వెండి ధర పెరగడం ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వెండి ధర రూ. 1900 మేర ర్యాలీ చేసింది.

బంగారం ధర 1820 - 25 డాలర్ల పైన క్లోజ్ అయితే అది పాజిటివ్‌గా పరిగణించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారానికి 200 రోజుల మూవింగ్ యావరేజ్ 1837.57 డాలర్ల వద్ద బలమైన నిరోధం ఉందని చెబుతున్నారు. దీన్ని అధిగమిస్తే.. పసిడి ర్యాలీ కొనసాగొచ్చు. పసిడి 1820-25 డాలర్ల మద్దతు స్థాయిని కోల్పోతే 1800 డాలర్ల వద్ద తొలి సపోర్ట్ లభిస్తుందని తెలిపారు. దీన్ని కూడా నిలుపుకోలేకపోతే అప్పుడు బంగారం ధర 1786 డాలర్లకు పడిపోవచ్చు. ఈ స్థాయి కిందకు తగ్గితే 1780 డాలర్లు, తర్వాత 1752 డాలర్ల స్థాయికి క్షీణించొచ్చు. అందువల్ల బంగారం ధరలు ప్రస్తుతం డౌన్ ట్రెండ్‌లోనే కొనసాగుతోందని చెప్పుకోవచ్చు.

Also Read: undefined

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.