యాప్నగరం

కొండెక్కుతోన్న బంగారం ధర.. పరుగులు పెడుతున్న వెండి.. ఈరోజు రేట్లు ఇవే!

బంగారం ధర పైపైకి చేరుతూనే వస్తోంది. పరుగులు పెడుతూనే వస్తోంది. ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు పడిపోయింది.

Samayam Telugu 10 Apr 2021, 7:35 am

ప్రధానాంశాలు:

  • బంగారం ధర జిగేల్
  • వెండి దూకుడు
  • గ్లోబల్ మార్కెట్‌లో డౌన్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold jewellery
బంగారం కొనే వారికి ఝలక్. పసిడి ధర మళ్లీ కొండెక్కుతోంది. పరుగులు పెడుతూనే వస్తోంది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా 4వ రోజు కావడం గమనార్హం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనిస్తోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 పెరుగుదలతో రూ.47,460కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.500 పెరుగుదలతో రూ.43,500కు ఎగసింది.
Also Read: undefined

బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,100కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.77 శాతం తగ్గుదలతో 1744 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.06 శాతం క్షీణతతో 25.31 డాలర్లకు తగ్గింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.