యాప్నగరం

షాకిచ్చిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి.. ఈరోజు రేట్లు ఇవే!

బంగారం కొనే వారికి షాక్. పసిడి రేటు పరుగులు పెడుతోంది. బంగారం ధర ఈరోజు కూడా పైకి కదిలింది. పసిడి రేటు పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది.

Samayam Telugu 10 Mar 2021, 6:16 am

ప్రధానాంశాలు:

  • బంగారం కొనే వారికి బ్యాడ్ న్యూస్
  • పరుగులు పెట్టిన పసిడి
  • భారీగా పెరిగిన వెండి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu today gold rate
బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. పసిడి రేటు పరుగులు పెడుతూనే వస్తోంది. బంగారం ధర ఈరోజు కూడా పెరిగింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధర పరుగులు పెట్టడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 పైకి కదిలింది. దీంతో రేటు రూ.45,820కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.290 పెరుగుదలతో రూ.42,000కు ఎగసింది.

Also Read: undefined

బంగారం ధర పరుగులు పెడితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి ఏకంగా రూ.900 పెరిగింది. దీంతో రేటు రూ.71,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 1682 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 25.29 డాలర్లకు చేరింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.