యాప్నగరం

Gold లోన్ తీసుకునే వారికి శుభవార్త.. ముత్తూట్ ఫైనాన్స్ కొత్త సర్వీసులు!

గోల్డ్ లోన్ కావాలా? అయితే మీకు తీపికబురు. మీకోసం కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ అన్ లాకర్ పేరుతో కొత్త సేవలు ఆవిష్కరించింది. ఇందులో భాగంగా పలు బెనిఫిట్స్ పొందొచ్చు.

Samayam Telugu 18 Feb 2021, 2:55 pm

ప్రధానాంశాలు:

  • బంగారంపై రుణాలు
  • కస్టమర్లకు తీపికబురు
  • ముత్తూట్ కొత్త సేవలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu muthoot gold loan
బంగారంపై రుణం పొందాలని యోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ప్రముఖ బంగారు రుణాల సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల గోల్డ్ లోన్ తీసుకునే వారికి బెనిఫిట్స్ కలుగుతుంది.
ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ అన్‌లాకర్ పేరుతో కొత్త సర్వీసులు ప్రారంభించింది. ఇందులో భాగంగా కస్టమర్లు వారి బంగారంపై ఎప్పుడైనా.. ఎంత మొత్తాన్ని అయినా.. ఎక్కడి నుంచైనా పొందొచ్చు. అంటే మీరు మీ బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌కు వెళ్లి తనఖా పెట్టాలి.

Also Read: undefined

ఇప్పుడు మీ బంగారంపై ఎంత రుణం తీసుకోవచ్చొ తెలుస్తుంది. రుణ మొత్తంలో మీకు నచ్చిన డబ్బును పొందొచ్చు. మిగిలిన డబ్బును అలాగే మీ ముత్తూ్ట్ గోల్డ్ అన్‌లాకర్ అకౌంట్‌లో కొనసాగించొచ్చు. ఇలా మీరు ఉపయోగించిన డబ్బుకే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.

ఐముత్తూట్ యాప్ ద్వారా మీరు మీ అకౌంట్‌ను ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్వీసులు ఇంకా అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రాలేదు. ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఈ సర్వీసులు లభిస్తున్నాయి. దీంతో అత్యవసరం అయినప్పుడు వెంటనే డబ్బులు లభిస్తాయి. ఇంకా మీ బంగారం ముత్తూట్ దగ్గర సురక్షితంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరిలోని ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ బ్రాంచ్‌ను సంప్రదించండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.