యాప్నగరం

గోల్డ్ లోన్ తీసుకునే వారికి SBI శుభవార్త.. అదిరే ఆఫర్లు!

మీరు బంగారంపై లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఎస్‌బీఐలో అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, ఈజీ లోన్ రీపేమెంట్ వంటి ఆప్షన్లు లభిస్తున్నాయి.

Samayam Telugu 16 Nov 2021, 11:27 am

ప్రధానాంశాలు:

  • బంగారంపై రుణాలు
  • ఎస్‌బీఐ అదిరే ఆఫర్లు
  • పలు బెనిఫిట్స్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sbi news
మీరు బంగారంపై రుణం పొందాలని భావిస్తున్నారా? అయితే మీకోసం చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు లేదా గోల్డ్ ఫైనాన్స్ సంస్థల్లో బంగారం తనఖా పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. అయితే వడ్డీ రేట్లు ఎక్కడ తక్కువ ఉంటే.. అక్కడ లోన్ తీసుకోవడం బెస్ట్.
సాధారణంగా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం ఉత్తమం. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా చౌక వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ అందిస్తోంది.

Also Read: undefined

Also Read: undefined

ఎస్‌బీఐలో గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమౌతుంది. తక్కువ వడ్డీ రేటు మాత్రమే కాకుండా ఇతర బెనిఫిట్స కూడా ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు పొందొచ్చు. అలాగే పలు రకాల రీపేమెంట్ ఆప్షన్లు లభిస్తాయి.

స్టేట్ బ్యాంక్‌లో బంగారం తనఖా పెట్టి రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు రుణం పొందొచ్చు. లోన్ టెన్యూర్ 3 ఏళ్లు. ఎస్‌బీఐ యోనో ద్వారా రుణం కోసం అప్లై చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు లభిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.