యాప్నగరం

గోల్డ్ బాండ్ స్కీమ్.. తక్కువ ధరకే బంగారం కొనొచ్చు.. మరిన్ని బెనిఫిట్స్!

మీరు గోల్డ్ బాండ్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మళ్లీ గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులోకి రాబోతోంది. సోమవారం నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కాబోతోంది.

Samayam Telugu 22 Oct 2021, 11:19 am

ప్రధానాంశాలు:

  • మళ్లీ గోల్డ్ బాండ్ స్కీమ్
  • అక్టోబర్ 25 నుంచి ప్రారంభం
  • పలు ప్రయోజనాలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold news
కేంద్ర ప్రభుత్వం మరోసారి గోల్డ్ బాండ్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అక్టోబర్ 15 నుంచి బంగారు బాండ్ల విక్రయం ఉంటుంది. అక్టోబర్ 29 వరకు గోల్డ్ బాండ్లు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకుు మినహాయించి ఇతర బ్యాంకుల్లో ఈ గోల్డ్ బాండ్లు అందుబాటులో ఉంటాయి. మీరు మీకు దగ్గరిలోని ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లి కూడా గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. పలు పోస్టాఫీసుల్లో కూడా ఈ సౌకర్యం ఉంది.

Also Read: undefined

కేంద్ర ప్రభుత్వం తరుపున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బంగారు బాండ్లను విక్రయిస్తోంది. ఆన్‌లైన్‌లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తే గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. ఈ గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ కాలం 8 ఏళ్లు. ఐదేళ్ల తర్వాత బాండ్ల నుంచి ఎగ్జిట్ కావొచ్చు.

గోల్డ్ బాండ్లపై ఏడాదికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక గ్రాము దగ్గరి నుంచి 4 కేజీల వరకు విలువైన గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. గోల్డ్ బాండ్ ధర విషయానికి వస్తే.. గత మూడు రోజుల బంగారం ధర సగటు ప్రాతిపదికన ధర నిర్ణయం అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.