యాప్నగరం

Today Gold Rate: గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..!

బంగారం ధర పైకి కదిలింది. వెండి ధర మాత్రం పరుగులు పెడుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేలచూపు చూస్తున్నాయి. బంగారం ధర ఔన్స్‌కు 1,500 డాలర్ల దిగువకు పతనమైంది. వెండి ధరదీ ఇదే దారి.

Samayam Telugu 10 Sep 2019, 7:21 am

ప్రధానాంశాలు:

  • దిగొచ్చిన బంగారం ధర
  • వెండి ధర మాత్రం పరుగు
  • అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కిందకు
  • 1,497 డాలర్ల సమీపంలో కదలిక

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold
పసిడి ధర పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.39,910కు తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.120 తగ్గుదలతో రూ.36,590కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.200 పెరుగుదలతో రూ.53,200కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పెరగడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 తగ్గుదలతో రూ.38,600కు దిగొచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.37,400కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర భారీగా పెరిగింది. రూ.200 పెరుగుదలతో రూ.53,200కు చేరింది.

Also Read: undefined

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.91 శాతం తగ్గుదలతో 1,497.10 డాలర్లకు దిగొచ్చింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 1.46 శాతం తగ్గుదలతో 17.89 డాలర్లకు క్షీణించింది.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.