యాప్నగరం

Today Gold Rate: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి మాత్రం..

బంగారం ధర మళ్లీ భారీగా పెరిగింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. మరోవైపు గ్లోబల్ మార్కె‌లో పసిడి స్వల్పంగా తగ్గింది. వెండి మాత్రం పెరిగింది.

Samayam Telugu 11 Aug 2019, 7:26 am

ప్రధానాంశాలు:

  • మళ్లీ పరుగులు పెట్టిన పసిడి ధర
  • వెండి ధర మాత్రం దాదాపు అక్కడే
  • అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కిందకు
  • 1,508 డాలర్ల సమీపంలో కదలిక

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu GOLD
పసిడి పరిగెడుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో ఆదివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరుగుదలతో రూ.39,190కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.130 పెరుగుదలతో రూ.35,820కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా క్షీణించింది. కేజీ వెండి ధర రూ.3 క్షీణతతో రూ.44,522కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గుదలతో 1,508.35 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 16.95 డాలర్లకు ఎగసింది.

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.37,800కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 పెరుగుదలతో రూ.36,600కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేవలం రూ.3 తగ్గుదలతో రూ.44,522కు క్షీణించింది.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.