యాప్నగరం

Today Gold Rate: బంగారం మళ్లీ పడింది.. ఎంతంటే?

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.41 శాతం పెరుగుదలతో 1,296.25 డాలర్లకు ఎగసింది. వెండి ధర ఔన్స్‌కు 1.03 శాతం పెరుగుదలతో 15.43 డాలర్లకు చేరింది.

Samayam Telugu 12 Mar 2019, 4:46 pm

ప్రధానాంశాలు:

  • ఢిల్లీలో రూ.100 తగ్గిన 10 గ్రాముల పసిడి ధర
  • దీంతో రూ.33,150 స్థాయికి క్షీణత
  • రూ.50 పెరిగిన కేజీ వెండి ధర
  • అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold
రికవరీ బాట పట్టినట్లు కనిపించిన పసిడి మళ్లీ పడిపోయింది. బంగారం ధర మంగళవారం తగ్గింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.33,150కు క్షీణించింది. దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ నెమ్మదించడం ఇందుకు కారణం.
బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పెరుగుదలతో రూ.39,580కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.41 శాతం పెరుగుదలతో 1,296.25 డాలర్లకు ఎగసింది. వెండి ధర ఔన్స్‌కు 1.03 శాతం పెరుగుదలతో 15.43 డాలర్లకు చేరింది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.33,150కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.32,980కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

కేజీ వెండి రూ.50 పెరుగుదలతో రూ.39,580కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.55 క్షీణతతో రూ.38,660కు తగ్గింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,130కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,600కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర రూ.41,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.