యాప్నగరం

Today Gold Rate: ఒకటో తేదీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి కూడా పైపైకే!

పసిడి ధర పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఆదివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.260 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,770కు ఎగసింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Samayam Telugu 11 Aug 2020, 6:13 pm
పసిడి ధర పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఆదివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.260 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,770కు ఎగసింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Samayam Telugu today 22ct 24ct gold silver price in hyderabad 1st december 2019
Today Gold Rate: ఒకటో తేదీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి కూడా పైపైకే!


gold economic times

పసిడి పైపైకి

అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.36,460కు చేరింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.46,650కు చేరింది.

Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. మరి వెండి?

దేశ రాజధానిలోనూ ఇదే ట్రెండ్

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 పైకి కదిలింది. దీంతో ధర రూ.38,400కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 పెరిగింది. దీంతో ధర రూ.37,200కు ఎగసింది.

Also Read: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి రూ.2 లక్షల వరకు లోన్!

వెండి పరుగు

బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో ధర రూ.46,650కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

Also Read: హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారా? ఈ పెనాల్టీలు తెలుసుకోండి!

చైనాతో డీల్ ప్రభావం

ఈ ఏడాది చివరికల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియోన్ మాట్లాడుతూ.. డిసెంబర్ కల్లా చైనాతో తొలి విడత డీల్ ఓకే కావొచ్చని తెలిపారు. దీంతో పసిడి ధరపై ఒత్తిడి నెలకొంది.

ఈ ఏడాది 19 శాతం ర్యాలీ

మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 19 శాతం పరుగులు పెట్టింది. సెప్టెంబర్ నెల ఆరంభంలో బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. వెండి ధర కూడా కేజీకి ఏకంగా రూ.50 వేల మార్క్‌కు ఎగసింది. అయితే మళ్లీ బంగారం ధర ఆ స్థాయికి వెళ్లలేదు.

పసిడిపై వీటి ప్రభావం

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.