యాప్నగరం

Gold Rate Today: ఒకే రోజు రూ.360 పెరిగిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.71 శాతం తగ్గుదలతో 1,337.95 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు స్వల్పంగా తగ్గి 15.98 డాలర్లకు క్షీణించింది.

Samayam Telugu 21 Feb 2019, 6:19 pm

ప్రధానాంశాలు:

  • ఢిల్లీలో రూ.34,830 స్థాయికి చేరిన 10 గ్రాముల పసిడి ధర
  • రూ.140 తగ్గిన కేజీ వెండి ధర
  • అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన బంగారం ధర

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold
పసిడి మళ్లీ పెరిగింది. బుధవారం దిగొచ్చిన బంగారం ధర గురువారం మళ్లీ పైకి కదిలింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.360 పెరుగుదలతో రూ.34,830 స్థాయికి ఎగసింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం కారణంగా బంగారం ధరలు పైకి కదిలాయని ట్రేడర్లు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా ఉండటంతో ధరల పెరుగుదల పరిమిత స్థాయిలోనే ఉందని తెలిపారు.
బంగారం ధర పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.140 తగ్గుదలతో రూ.41,660కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.71 శాతం తగ్గుదలతో 1,337.95 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు స్వల్పంగా తగ్గి 15.98 డాలర్లకు క్షీణించింది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.360 పెరుగుదలతో రూ.34,830కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 పెరుగుదలతో రూ.34,680కు ఎగసింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.26,600కు పెరిగింది.

కేజీ వెండి ధర రూ.140 క్షీణతతో రూ.41,660లకు తగ్గితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.51 తగ్గుదలతో రూ.40,501కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.83,000 వద్ద, అమ్మకం ధర రూ.84,000 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,660కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,060కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.43,500కు క్షీణించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.