యాప్నగరం

Today Gold Rate: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి!

బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర పడిపోవడం ఇది వరుసగా 3వ రోజు కావడం గమనార్హం. బంగారం ధర పడిపోతూ వస్తే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పైకి కదులుతోంది.

Samayam Telugu 23 Oct 2019, 5:35 pm

ప్రధానాంశాలు:

  • మూడో రోజు తగ్గిన బంగారం ధర
  • వెండి ధర మాత్రం పైపైకి
  • అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి అప్
  • 1,490 డాలర్ల స్థాయిలో కదలిక

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu GOLD RATE IN AP
పసిడి ధర మళ్లీ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,800కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.150 తగ్గింది. దీంతో ధర రూ.36,470కు క్షీణించింది. పసిడి ధర ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. ఏకంగా రూ.500 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర రూ.150 చొప్పున దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గింది. దీంతో ధర రూ.38,450కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 తగ్గింది. దీంతో ధర రూ.37,250కు క్షీణించింది.

Also Read: undefined

బంగారం ధర తగ్గితే.. కేజీ వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. రూ.500 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.48,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

Also Read: undefined

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 1,491.20 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.33 శాతం పెరుగుదలతో 17.55 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.

Also Read: undefined

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.