యాప్నగరం

Today Gold Rate: బంగారం ధర తగ్గింది.. వెండి మాత్రం..

పసిడి ధర పడిపోయింది. వెండి ధర మాత్రం అక్కడే నిలకడగా కొనసాగుతోంది. ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. వెండి ధర కూడా స్వల్పంగా పైకి కదిలింది. కాగా పసిడి ధరపై వివిధ రకాల అంశాలు ప్రభావం చూపిస్తాయి.

Samayam Telugu 29 Jul 2019, 10:39 am

ప్రధానాంశాలు:

  • తగ్గిన పసిడి ధర
  • వెండి ధర మాత్రం అక్కడే
  • అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి
  • 1,418 డాలర్ల మార్క్‌ పైన కదలిక
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu GOLD
పసిడి ధర తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఆదివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గుదలతో రూ.36,500కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 క్షీణతతో రూ.33,310కు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగింది. కేజీ వెండి ధర రూ.44,835 వద్ద ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 1,418.60 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 16.41 డాలర్లకు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.35,200కు క్షీణించింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 క్షీణతతో రూ.34,000కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా రూ.44,835 వద్ద ఉంది.

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.