యాప్నగరం

Today Gold Rate: శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. ఎంతంటే?

పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ కొంతమేర మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నాయి.

Samayam Telugu 3 Jan 2020, 8:27 am
పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ కొంతమేర మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నాయి.
Samayam Telugu today 22ct 24ct gold silver price in hyderabad 3rd january 2020
Today Gold Rate: శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. ఎంతంటే?


హైదరాబాద్‌ మార్కెట్‌లో..

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.30 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.37,320కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.30 తగ్గుదలతో రూ.40,720కు దిగొచ్చింది.

Also Read: ఈ ఒక్క యాప్ మీ ఫోన్‌లో ఉంటే చాలు.. 35 రకాల ఆధార్ సేవలు మీ అరచేతిలో ఉన్నట్లే!

వెండి మాత్రం..

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.49,350 వద్దనే నిలకడగానే కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు కారణం.

Also Read: ఈపీఎఫ్‌వో గుడ్ న్యూస్.. వారికి కూడా పీఎఫ్ ప్రయోజనాలు.. కేంద్రం స్పష్టత!

విజయవాడ, విశాఖపట్నంలో ధరలు ఇలా

విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లోనూ బంగారం ధర తగ్గింది. రూ.30 మేర దిగొచ్చింది. ఇది 22, 24 క్యారెట్ల బంగారానికి వర్తిస్తుంది. దీంతో వీటి ధరలు వరుసగా 10 గ్రాములకు రూ.37,320గా, రూ.40,720గా ఉన్నాయి. వెండి ధర మాత్రం రూ,49,350 వద్ద నిలకడగానే ఉంది.

Also Read: కళ్లుచెదిరే లాభం.. రూ.లక్ష పెడితే 5 ఏళ్లలోనే రూ.18 లక్షలు!

ఢిల్లీ మార్కెట్‌లో..

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.38,100కు క్షీణించింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,100కు క్షీణించింది. కానీ కేజీ వెండి ధర నిలకడగానే కొనసాగింది. దీంతో ధర రూ.49,350 వద్దనే స్థిరంగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో..

ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.30 శాతం పెరుగుదలతో 1,532.55 డాలర్లకు ఎగసింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 0.26 శాతం పెరుగుదతో 18.03 డాలర్లకు ఎగసింది.

Also Read: డీటీహెచ్ యూజర్లకు శుభవార్త.. రూ.130కే 200 ఛానళ్లు.. ట్రాయ్ కొత్త రూల్స్!

6 ఏళ్ల గరిష్టానికి

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 2019 సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.

భారత్‌లో 22 శాతం ర్యాలీ

మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర గత ఏడాది దాదాపు 22 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.

బంగారం ధరపై వీటి ప్రభావం

బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.