యాప్నగరం

Today Gold Rate: పతనానికి బ్రేక్.. బంగారం మెరిసింది

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.65 శాతం పెరుగుదలతో 1,294.35 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.68 శాతం పెరుగుదలతో 15.14 డాలర్లకు ఎగసింది.

Samayam Telugu 8 Mar 2019, 4:33 pm

ప్రధానాంశాలు:

  • ఢిల్లీలో రూ.200 పెరిగిన 10 గ్రాముల పసిడి ధర
  • దీంతో రూ.33,270 స్థాయికి చేరిక
  • కేజీ వెండి ధర రూ.120 అప్
  • అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధర

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu gold
పసిడి పతనం ఆగింది. బంగారం ధర శక్రవారం పెరిగింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.33,270కు ఎగసింది. దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం సహా సానుకూల అంతర్జాతీయ ట్రెండ్ ఇందుకు కారణం. కాగా బంగారం ధర గత 8 రోజుల్లో ఏకంగా రూ.1,580 పతనం కావడం గమనార్హం.
బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.120 పెరుగుదలతో రూ.39,100కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.

చైనా ఎగమతులు తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి బలహీనంగా ఉందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.65 శాతం పెరుగుదలతో 1,294.35 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.68 శాతం పెరుగుదలతో 15.14 డాలర్లకు ఎగసింది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.33,270కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.33,100కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

కేజీ వెండి రూ.120 పెరుగుదలతో రూ.39,100కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.108 పెరుగుదలతో రూ.38,310కు ఎగసింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,260కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,720కు పెరిగింది. ఇక కేజీ వెండి ధర రూ.41,100కు చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.