యాప్నగరం

Today Gold Rate: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర..!

పసిడి ధర మళ్లీ దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.290 తగ్గింది. దీంతో ధర రూ.36,120కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Samayam Telugu 10 Aug 2020, 4:27 pm
పసిడి ధర మళ్లీ దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.290 తగ్గింది. దీంతో ధర రూ.36,120కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Samayam Telugu today 22ct 24ct gold silver price in hyderabad 9th december 2019
Today Gold Rate: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర..!


GOLD

వెండి మాత్రం..

అదేసమయంలో 10 గ్రాముల 24 కార్యెట్ల బంగార ధర కూడా రూ.190 పడిపోయింది. దీంతో ధర రూ.39,530కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో వెండి ధర రూ.47,500 వద్ద స్థిరంగా ఉంది.

Also Read: ఎస్‌బీఐ శుభవార్త.. లోన్ తీసుకుంటే అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా 50 శాతం డిస్కౌంట్!

దేశ రాజధానిలోనూ ఇదే ట్రెండ్

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గింది. రూ.38,100కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 తగ్గుదలతో రూ.36,900కు క్షీణించింది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ధర కేజీకి రూ.47,500 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

Also Read: మారుతీ కార్లపై కళ్లుచెదిరే ఆఫర్లు.. రూ.లక్షకు పైగా డిస్కౌంట్!

గ్లోబల్ మార్కెట్‌లో..

ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పైకి కదిలింది. ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 1,465.35 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.31 శాతం పెరుగుదలతో 16.64 డాలర్లకు ఎగసింది.

Also Read: మీకు ఈ విషయం తెలుసా? డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు!

6 ఏళ్ల గరిష్టానికి

ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.

Also Read: Credit Score లేకుండానే రూ.5,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం!

చైనాతో డీల్ ఎఫెక్ట్ కారణం

సాధారణంగా ఈ ఏడాది చివరికల్లా చైనాతో అమెరికా వాణిజ్య డీల్ ఓకే కావొచ్చనే అంచనాలు ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రియోన్ కూడా డిసెంబర్ కల్లా చైనాతో తొలి విడత డీల్ ఓకే కావొచ్చని గతంలో తెలిపారు. దీంతో పసిడి ధరపై ఒత్తిడి నెలకొంది. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డీల్ ఆలస్యం కావొచ్చని తెలిపారు. దీంతో మళ్లీ పసిడి ధరపై అనిశ్చితి నెలకొంది.

Also Read: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర.. వెండి రూ.1,000కు పైగా డౌన్!

నెల గరిష్టానికి పసిడి

బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గత వారంలో నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1484 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి.

అందరి చూపు ఫెడ్ మీటింగ్‌ వైపు

అంతర్జాతీయ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వు మీటింగ్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. వచ్చే వారం ఫెడ్ మీటింగ్ జరగనుంది. ఫెడరల్ రిజర్వు ఈసారి వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఫెడ్ రేటు స్థిరంగా కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు ఫెడ్ రేటు 1.5 శాతం నుంచి 1.75 శాతం మధ్యలో ఉంది.

20 శాతం ర్యాలీ

మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 20 శాతం పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.