యాప్నగరం

Gold Price: పెరిగిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి.. లేటెస్ట్ రేట్లు ఇలా!

నిన్న ఒక్క రోజే రిలీఫ్. ఈరోజు మళ్లీ బంగారం ధర పరుగులు పెట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ర్యాలీ చేయడంతో ఆ ప్రభావం మన మార్కెట్‌పై కూడా పడింది. బంగారం బాటలోనే వెండి కూాడా పయనించింది.

Samayam Telugu 11 Aug 2020, 9:37 am

ప్రధానాంశాలు:

  • పసిడి పైపైకి
  • వెండిదీ ఇదే దారి
  • గ్లోబల్ మార్కెట్‌లో బంగారం పరుగు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu timesofindia
బంగారం ధర పెరిగింది. మళ్లీ మెరిసింది. నిన్న తగ్గిన పసిడి ధర ఈరోజు మాత్రం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల కారణంగా మన మార్కెట్‌లోనూ పసిడి ధర పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది.
హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.43,900కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పెరుగుదలతో10 గ్రాములకు రూ.40,140కు ఎగసింది.

Also Read: undefined

పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.40 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.40,990కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 3.34 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర 1740 డాలర్ల పైకి చేరింది. ఔన్స్‌కు 1740.6 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలోనే నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 4.69 శాతం పెరుగుదలతో 15.91 డాలర్లకు చేరింది.

Also Read: undefined

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.42,280కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మాత్రం రూ.250 తగ్గుదలతో రూ.44,250కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.40 పెరిగింది. దీంతో ధర రూ.40,990కు చేరింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.