యాప్నగరం

Gold Price: బంగారం ధర జిగేల్.. వెండి వెలవెల!

బంగారం ధర మెరిసింది. 2 రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ధర ఈ రోజు మాత్రం ధగధగలాడింది. పైకి కదిలింది. బంగారం ధర భగభగమంటే.. వెండి ధర మాత్రం వెలవెలబోయింది.

Samayam Telugu 11 Aug 2020, 10:23 am

ప్రధానాంశాలు:

  • బంగారం ధర పైకి
  • వెండి మాత్రం కిందకు
  • గ్లోబల్ మార్కెట్‌లోనూ పసిడి కిందకే
  • 1,655 డాలర్ల వద్ద కదలిక

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu timesofindia
బంగారం ధర పరుగులు పెట్టింది. గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ఈ రోజు మాత్రం పైకి కదిలింది. దీంతో కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్‌లో పసడి ధర తగ్గినప్పటికీ దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడిపై సానుకూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపోతే బంగారం ధర పెరిగితే వెండి మాత్రం పడిపోయింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.180 పెరుగుదలతో రూ.45,980కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరుగుదలతో రూ.42,160కు చేరింది.
Also Read: undefined

పసిడి ధర పరుగులు పెడితే వెండి ధర మాత్రం పడిపోయింది. వెండి ధర భారీగానే దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.1,000 మేర పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం దిగొచ్చింది. 1660 డాలర్ల కిందకు వచ్చేసింది. పసిడి ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గుదలతో 1657.40 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.49 శాతం పెరుగుదలతో 17.03 డాలర్లకు చేరింది.

Also Read: undefined

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధరలో ఎలాంటి మార్పు లేదు. పసిడి ధర స్థిరంగానే కొనసాగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,850 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.44,050 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. ఇక వెండి ధర రూ.1000 తగ్గుదలతో రూ.48,500కు క్షీణించింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.