యాప్నగరం

శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. వెండి రూ.1,000 పైగా పతనం..!

బంగారం ధర మళ్లీ పడిపోయింది. నిన్న దిగొచ్చిన పసిడి ఈ రోజు కూడా వెలవెలబోయింది. నేలచూపులు చూసింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కానీ గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం పసిడి పైకి కదిలింది.

Samayam Telugu 18 Sep 2020, 6:20 am

ప్రధానాంశాలు:

  • బంగారం ధర డౌన్
  • వెండిదీ ఇదే దారి
  • గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పైకి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu GOLD
పసిడి పడిపోయింది. బంగారం ధర మళ్లీ దిగొచ్చింది. వెలవెలబోయింది. బంగారం ధర తగ్గడం వరుసగా రెండో రోజు కూడా క్షీణించింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి పడిపోవడం గమనార్హం. పసిడి తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.780 పడిపోయింది. దీంతో ధర రూ.55,460కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.720 తగ్గుదలతో రూ.50,840కు క్షీణించింది.

Also Read: undefined

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1100 పడిపోయింది. దీంతో ధర రూ.67,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. పసిడి ధర ఔన్స్‌కు 0.65 శాతం పెరుగుదలతో 1959 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.43 శాతం పెరుగుదలతో 27.53 డాలర్లకు చేరింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.