యాప్నగరం

షాకిచ్చిన వెండి.. బంగారం ధర మాత్రం..

రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు నిలకడగానే కొనసాగింది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. భారీగా పెరిగింది.

Samayam Telugu 14 Sep 2020, 10:02 am

ప్రధానాంశాలు:

  • నిలకడగానే బంగారం ధర
  • వెండి పరుగులు
  • గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పైకి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu today gold rate
బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ధర ఈరోజు మాత్రం నిలకడగానే కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి స్థిరంగా ఉండటం గమనార్హం. పసిడి నిలకడగా ఉన్నా కూడా వెండి మాత్రం పరుగులు పెట్టింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉంది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.55,460 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,840 వద్ద ఉంది.

Also Read: undefined

పసిడి ధర నిలకడగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.800 పైకి కదిలింది. దీంతో ధర రూ.67,800కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. పసిడి ధర ఔన్స్‌కు 0.06 శాతం పెరుగుదలతో 1947 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం దిగొచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.97 శాతం తగ్గుదలతో 26.88 డాలర్లకు క్షీణించింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.