యాప్నగరం

GST Slabs: టీవీలు, ఏసీల ధరలు తగ్గే అవకాశం!

తాజా మార్పులు అమల్లోకి వస్తే.. ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.10 వేల కోట్లనుంచి రూ.11 వేల కోట్ల ఆదాయం తగ్గనుంది.

Samayam Telugu 8 Dec 2018, 1:37 pm
త్వరలో టీవీ, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు తగ్గే అవకాశముంది. ఇందుకుగాను ప్రస్తుతం 28 శాతం శ్లాబ్‌ జీఎస్టీ పరిధిలో ఉన్న టీవీలు, ఏసీలు, డిష్‌ వాషర్స్‌, డిజిటల్ కెమెరాలు వంటి పలు రకాల వస్తువులను 18 శాతం శ్లాబులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై డిసెంబరు 17న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. దీంతో పాటు 28 శాతం శ్లాబ్‌ను తొలగించి 18 శాతాన్నే అత్యధిక శ్లాబ్‌గా కొనసాగించే ప్రతిపాదనను కూడా పరిశీలించనున్నారు.
Samayam Telugu GST-1


తాజా మార్పులు అమల్లోకి వస్తే.. ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.10 వేల కోట్లనుంచి రూ.11 వేల కోట్ల ఆదాయం తగ్గనుంది. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న పరోక్ష పన్నుల ఆదాయ లక్ష్యం రూ.12 లక్షల కోట్లు చేరుకోవడం కష్టతరమే. మరికొన్ని వస్తువులను 18 శాతం శ్లాబ్‌ నుంచి 5 శాతం శ్లాబుకు మార్చే అంశంపై కూడా సమాలోచనలు చేయనున్నారు.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదట్లో 28శాతం శ్లాబ్‌లో 226 వస్తువులు ఉండగా.. అనేక సవరణల అనంతరం ప్రస్తుతం ఆ సంఖ్య 35కు చేరింది. చివరి సారిగా 01 జూలై 2017న రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లతో పాటు మరికొన్ని ఎలక్ట్రికల్‌ ఉపకరణాలను 18శాతం శ్లాబ్‌లో చేర్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.