యాప్నగరం

జీఎస్టీ ఎఫెక్ట్: కోకా కోలా మరింత బాదుడు!

ఇప్పటికే ధరలను వాయించేస్తున్న శీతల పానీయాల సంస్థలు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో మరింత పెంచనున్నాయి.

TNN 28 Jun 2017, 12:27 pm
ఇప్పటికే ధరలను వాయించేస్తున్న శీతల పానీయాల సంస్థలు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో మరింత పెంచనున్నాయి. జులై 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రముఖ శీతలపానీయాల సంస్థ కోకా కోలా ఇండియా ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ కిన్లే ధరను తగ్గిస్తున్నట్లు కోకా కోలా వెల్లడించింది. జీఎస్‌టీలో శీతలపానీయాలపై పన్ను 40శాతంగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కూల్ డ్రింక్స్‌పై 28 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. పంజాబ్‌లో మాత్రం అత్యధికంగా 43 శాతం వడ్డిస్తున్నారు. ఇప్పుడు జీఎస్టీతో దేశ వ్యాప్తంగా కూల్ డ్రింక్స్‌పై 40 శాతం పన్ను వసూలు చేయనున్నారు.
Samayam Telugu coca cola to hike prices for carbonated drinks kinley to get cheaper
జీఎస్టీ ఎఫెక్ట్: కోకా కోలా మరింత బాదుడు!


జీఎస్టీ కౌన్సిల్ 40 శాతం పన్నును ప్రతిపాదించిన వెంటనే ఇండియన్ బెవరేజెస్ అసోసియేషన్ (ఐబీఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అసోసియేషన్‌లో కోకా కోలా ఇండియా, పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డాబర్ ఇండియా లిమిటెడ్, రెడ్ బుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పర్ల్ డ్రింక్స్ లిమిటెడ్‌ వంటి శీతల పానీయాల సంస్థలు ఉన్నాయి. అయితే తాజాగా కోకా కోలా ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

కంపెనీకి మరో మార్గం లేదని, కొత్త పన్నుల ప్రకారం ధరలను పెంచక తప్పదని కోకా కోలా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో పెరిగిన ధరల ప్రభావం వినియోగదారులపై పడకుండా అందుబాటు ధరలకు కూల్‌ డ్రింక్స్‌ను తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది. మరోపక్క ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ కిన్లే ధరలను తగ్గించాలని తన భాగస్వాములకు సూచించింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై ప్రస్తుతం విధిస్తున్న పన్నుల కన్నా జీఎస్‌టీలో తక్కువగా ఉండటంతో ధరలు తగ్గించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.