యాప్నగరం

GST TDS Filing: జీఎస్టీ టీడీఎస్ రిటర్నులకు గడువు పెంపు

ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రస్తుత త్రైమాసికానికిగాను టీడీఎస్ రిటర్నుల గడువును జనవరి చివరినాటికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 1 Dec 2018, 11:09 am
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్ - డిసెంబర్ మధ్యకాలానికి) టీడీఎస్ రిటర్నులు దాఖలు చేసే గడువును జనవరి 31, 2019 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద టీడీఎస్ చెల్లింపులను అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. సీజీఎస్టీ చట్టం ప్రకారం రూ.2.5 లక్షల కంటే అధిక ఆదాయం పొందిన సంస్థల నుంచి ఒక్క శాతం మేర టీడీఎస్‌ను వసూలు చేస్తున్నారు. రాష్ట్ర చట్టాల (ఎస్‌జీఎస్‌టీ) కింద మరో 1% పన్నునూ విధించాలి.
Samayam Telugu tds


ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రస్తుత త్రైమాసికానికిగాను టీడీఎస్ రిటర్నుల గడువును జనవరి చివరినాటికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పోర్టల్‌లో కొన్ని సందర్భాల్లో టీడీఎస్‌ పత్రాలు జారీ కావడం లేదని, ఫలితంగా పన్ను వసూలు చేసిన వారు, చెల్లించిన వారికి వివాదాలు తలెత్తుతున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ ప్రతీక్‌ జైన్‌ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.