యాప్నగరం

పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు!

జీఎస్‌టీ చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్ ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు. దీంతో జీఎస్‌టీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ప్రయోజనం కలుగుతుంది.

Samayam Telugu 12 Jun 2020, 4:24 pm

ప్రధానాంశాలు:

  • జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్
  • నిర్మలీ సీతారామన్ కీలక నిర్ణయాలు
  • పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu finance minister
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పన్ను వసూళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశమైంది. ఈ 40వ జీఎస్‌టీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇదే తొలి జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం కావడం గమనార్హం.
నిర్మలమ్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే నిర్ణయం ప్రకటించారు. రూ.5 కోట్లలోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులకు ఆలస్య రుసుము, వడ్డీ చెల్లింపుపై మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. మే, జూన్, జూలై నెలలకు జీఎస్‌టీఆర్ 3బీ ఫామ్ దాఖలు చేసిన వారికే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుందని, అలాగే సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

Also Read: undefined

అంతేకాకుండా జూలై 6 లోపు జీఎస్‌టీ రిటర్న్స్ దాఖలు చేసిన స్మాల్ ట్యాక్స్ పేయర్స్ కూడా వడ్డీ చెల్లించాల్సిన పని లేదని నిర్మలమ్మ తెలిపారు. జూలై 6 తర్వాత దాఖలు చేసిన రిటర్న్స్‌కు వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 30 వరకు ఇదే కొనసాగుతుందని తెలిపారు.

అలాగే పన్ను చెల్లిచాల్సిన వారు 2017 జూలై నుంచి 2020 జనవరి వరకు జీఎస్‌టీ 3జీ రిటర్న్స్ దాఖలు చేయని వారికి ఆలస్య రుసుము గరిష్టంగా రూ.500 వరకు ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దాఖలు చేసే అన్ని రిటర్న్స్‌కు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇకపోతే రాష్ట్రాలకు పరిహారం అంశంపై వచ్చే నెలలో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేస్తామని నిర్మలమ్మ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.