యాప్నగరం

New GST Return: జీఎస్‌టీ‌ చెల్లింపునకు కొత్త విధానం..!

కొత్త జీఎస్‌టీ విధానంలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. ఒకటి మెయిర్ రిటర్న్ (ఫామ్ జీఎస్‌టీ ఆర్ఈటీ1), మిగతావి రెండు అనుబంధ ఫామ్స్ (ఫామ్ జీఎస్‌టీ ఏఎన్ఎక్స్1, ఫామ్ జీఎస్‌టీ ఏఎన్ఎక్స్2). ​​

Samayam Telugu 12 Jun 2019, 10:30 am

ప్రధానాంశాలు:

  • జూలై నుంచి సెప్టెంబర్ వరకు ప్రయోగాత్మకంగా కొత్త విధానం
  • అక్టోబర్ 1 నుంచి అమలులోకి
  • జీఎస్‌టీ కౌన్సిల్ 31వ సమావేశంలో నిర్ణయం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu GST
కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ విధానాన్ని మరింత సరళతరం చేయాలని భావిస్తోంది. పన్ను చెల్లింపుదారుల సులుభంగా రిటర్న్స్ దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. అందుకే కొత్త విధానాన్ని ప్రతిపాదించింది.
జీఎస్‌టీ కౌన్సిల్ 31వ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను చెల్లింపుదారులకు కొత్త జీఎస్‌టీ రిటర్న్ వ్యవస్థను తీసుకురానున్నారు. దీన్ని జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో దీన్ని ప్రయోగాత్మకంగా వినియోగించి చూస్తారు.

కొత్త జీఎస్‌టీ విధానంలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. ఒకటి మెయిర్ రిటర్న్ (ఫామ్ జీఎస్‌టీ ఆర్ఈటీ1), మిగతావి రెండు అనుబంధ ఫామ్స్ (ఫామ్ జీఎస్‌టీ ఏఎన్ఎక్స్1, ఫామ్ జీఎస్‌టీ ఏఎన్ఎక్స్2).

అక్టోబరు నుంచి ముందు సంవత్సరంలో రూ.5 కోట్ల స్థూల వార్షిక టర్నోవర్‌ పైబడిన పన్ను చెల్లింపుదారులందరూ వెలుపలి సరఫరా వివరాలతో అనుబంధం-1 దాఖలు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అక్టోబరు, నవంబరు నెలలకు పెద్ద పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీఆర్‌-3బిని దాఖలు చేసి డిసెంబరు నెల రిటర్నుల నుంచి జీఎస్‌టీ రిటర్న్‌-01 దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.