యాప్నగరం

అర్ధరాత్రి జీఎస్టీ ఆవిష్కరణ.. విశేషాలివే!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి ప్రవేశపెట్టనున్నారు.

TNN 20 Jun 2017, 4:20 pm
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు జీఎస్టీ ఆవిష్కరణ విశేషాలను మంగళవారం అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడిచారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జీఎస్టీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జైట్లీ చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు.
Samayam Telugu gst launch at midnight here are the program details
అర్ధరాత్రి జీఎస్టీ ఆవిష్కరణ.. విశేషాలివే!


జీఎస్టీ ఆవిష్కరణ వేడుక మరిన్ని విశేషాలు
1. జూన్ 30వ తేదీ అర్ధరాత్రి అంటే సరిగ్గా 12 గంటలకు జీఎస్టీని ఆవిష్కరించనున్నారు. జూలై 1 నుంచి కచ్చితంగా అమల్లోకి వచ్చేలా దీన్ని అర్ధరాత్రి ప్రవేశపెడుతున్నారు.
2. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో జీఎస్టీ‌ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు రావడానికి రాష్ట్రపతి సమ్మతించినట్లు జైట్లీ వెల్లడించారు.
3. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు.
4. మాజీ ప్రధాన మంత్రలు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడ పాల్గొంటారు.
5. గంటకు పైగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జీఎస్టీపై ప్రసంగిస్తారు.
6. జీఎస్టీ ఆవిష్కరణ సందర్భంగా రెండు షార్ట్ ఫిల్మ్‌లను ప్రదర్శించనున్నారు.
7. ఈ వేడుకను పార్లమెంట్ సెంట్రల్ హాల్ అంగరంగ వైభంగా నిర్వహించనున్నారు.

మంగళవారం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. సరికొత్త జీఎస్టీ విధానానికి మారడానికి పరిశ్రమ సన్నద్ధం కావాలని సూచించారు. ఇదేమీ అంత కష్టమైన ప్రక్రియ కాదని చెప్పారు. ఇబ్బందులు స్వల్పకాలమేనన్నారు. తొలి రెండు నెలలపాటు రిటర్నులు దాఖలు విషయంలో వ్యాపారులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.