యాప్నగరం

జీఎస్టీ ఎఫెక్ట్.. మరో 177 వస్తువుల ధరలు తగ్గుతాయ్!

శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌‌లో వినియోగదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

TNN 10 Nov 2017, 4:40 pm
వస్తు సేవల పన్ను పరిధిలోని 28 శాతం శ్లాబులో ఉన్న మరో 177 వస్తువులను దాన్ని నుంచి తప్పించారు. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సవరణలను చేస్తున్న సంగతి తెలిసిందే. గువహటి వేదికగా జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాక్లెట్లు, చూయింగ్‌ గమ్‌లు, షాంపూలు, డియోడ్రెంట్‌లు, షూ పాలిష్‌, డిటర్జెంట్‌, పోషకాహార పానీయాలు, సౌందర్య సాధనాలు లాంటి ధరలు తగ్గనున్నాయి.
Samayam Telugu gst rate on daily use items cut to 18 from highest slab of 28
జీఎస్టీ ఎఫెక్ట్.. మరో 177 వస్తువుల ధరలు తగ్గుతాయ్!


‘ఇప్పటివరకు 28 శ్లాబు పరిధిలో 227 వస్తువులు ఉండేవి... తాజాగా 177 ను ఈ పరిధి నుంచి తప్పించడంతో కేవలం 50 వస్తువులు మాత్రమే ఉన్నాయని... ఫిట్‌మెంట్‌ కమిటీ 62 వస్తువులను ఈ శ్లాబు నుంచి తొలగించాలని సిఫారసు చేయగా, జీఎస్‌టీ మండలి అంతకన్నా ఎక్కువ వస్తువులను తొలగించిందని బిహార్ ఆర్థిక శాఖ మంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. దీంతో చాలా వస్తువులు 28శాతం నుంచి 18శాతం శ్లాబులోకి వస్తాయి. తదనుగుణంగానే ధరలు కూడా తగ్గుతాయని ఆయన వెల్డించారు.

పెయింట్స్‌, సిమెంట్‌, విలాస వస్తువులు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్లు 28శాతం శ్లాబులోనే ఉంచినట్లు చెప్పిన ఆయన చాలా వస్తువులు 18శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం ఖజనాపై ఏడాదికి రూ.20వేల కోట్ల మేర ప్రభావం చూపుతుందుని అన్నారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్నులో ఐదు శ్లాబులు ఉన్న విషయం తెలిసిందే. 0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.