యాప్నగరం

జీఎస్టీ: క్రికెట్ మ్యాచ్ టికెట్లపైనా బాదుడే!

స్టేడియంకి వెళ్లి క్రికెట్ మ్యాచ్‌ను లైవ్‌లో చూద్దామనుకునే వారి జేబులకు పెద్ద చిల్లు పడటం ఖాయం.

TNN 30 Jun 2017, 10:03 am
స్టేడియంకి వెళ్లి క్రికెట్ మ్యాచ్‌ను లైవ్‌లో చూద్దామనుకునే వారి జేబులకు పెద్ద చిల్లు పడటం ఖాయం. జులై 1 నుంచి దేశంలో జీఎస్టీ అమలులోకి రానున్న నేపథ్యంలో మ్యాచ్ టికెట్ల ధరలు పెరగనున్నాయి. ఐపీఎల్ వంటి ఎంటర్‌టైనింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ టికెట్లపై ప్రభుత్వం 28 శాతం ట్యాక్స్ వసూలు చేయనుంది. దీనివల్ల ఆయా ఆర్గనైజర్లు టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంది. అత్యధిక ప్రైజ్ మనీ, అమితమైన వినోదం కలగలిపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి మ్యాచ్‌ల టికెట్ ధరలపై అత్యధికంగా 28 శాతం పన్ను వసూలు చేయనున్నారు.
Samayam Telugu post gst watching live sports will be costlier
జీఎస్టీ: క్రికెట్ మ్యాచ్ టికెట్లపైనా బాదుడే!


ఇక ప్రభుత్వ గుర్తింపు పొందిన బీసీసీఐ, హాకీ ఫెడరేషన్ వంటి స్పోర్ట్స్ బాడీల ఆధ్వర్యంలో జరిగే మ్యాచ్‌ల టికెట్ ధరలపై పన్నును 18 శాతానికి తగ్గించారు. టికెట్ ధరలు రూ. 250 కన్నా తక్కువగా ఉంటే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ఏ స్టేడియంలో అయినా రూ. 250 టికెట్ ధరపై సీట్లు పరిమితంగా ఉండాలని జీఎస్టీ కౌన్సిల్ మెలిక పెట్టింది.

భారత్‌లో గర్తింపు పొందిన క్రీడా సంఘాలు నిర్వహించే ఏ ఈవెంట్‌కైనా టికెట్ ధరలపై 28 శాతం పన్ను వసూలు చేయాలని మొదట్లో జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించింది. అయితే గురువారం మరోమారు సమావేశమైన కౌన్సిల్ దీన్ని 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఐపీఎల్, ప్రో కబడ్డీ వంటి కమర్షియల్ స్పోర్ట్స్ ఈవెంట్స్‌పై 28 శాతం పన్నును ఖరారు చేసింది. అంటే ఇకపై ఐపీఎల్ మ్యాచ్లను స్టేడియంకి వెళ్లి చూడాలంటే సామాన్యులకు కష్టమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.