యాప్నగరం

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌.. నేడే ఆఖరు

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటి రిటర్న్స్ దాఖలు గడువు నేటితో (ఆగస్టు 31)తో ముగియనుంది. వాస్తవానికి జులై 31తోనే గడువు ముగియగా... ఆగస్టు 31 వరకు పొడిగించారు. నేటితో ఆ గడువు ముగియనుంది.

Samayam Telugu 31 Aug 2018, 11:32 am
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటి రిటర్న్స్ దాఖలు గడువు నేటితో (ఆగస్టు 31)తో ముగియనుంది. వాస్తవానికి జులై 31తోనే గడువు ముగియగా... ఆగస్టు 31 వరకు పొడిగించారు. నేటితో ఆ గడువు ముగియనుంది. తీవ్ర వరదలతో కకావికలమైన కేరళలో మాత్రం ఆదాయం పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గడువు తేదీ సెప్టెంబరు 15 వరకు ఉంది. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో చేర్చిన కొత్త నిబంధన 234ఎఫ్ ప్రకారం.. గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనివారికి రూ. 5000 అపరాధరుసుం విధిస్తారు. డిసెంబర్ 31 తర్వాత సెక్షన్ 139(1) ప్రకారం రూ. 10,000 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
Samayam Telugu it


ఐటీ శాఖలో సూచించిన ఆదాయం పరిధిలో ఉన్నవారంతా ప‌న్ను క‌ట్టాల్సిందే. ఎల్‌ఐసీ, స్వచ్ఛంద సేవలకు రుణ వితరణ లాంటి వాటిని చూపెట్టి ప‌న్ను మిన‌హాయింపులు కోర‌ద‌లుచుకున్నా, టీడీఎస్ రిట‌ర్న్ రావాల‌నుకున్నా ఐటీ రిట‌ర్న్స్ స‌మ‌ర్పించాల్సిందే.
ఎవరెవరు ఐటీఆర్ ఫైలింగ్ చేయాలంటే..
* 2017 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,50,000 మించి ఆదాయం ఉన్నవారు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. రీఫండ్‌ కోరుకునే వ్యక్తులు, వార్షిక ఆదాయం రూ. 5 ల‌క్షలకు మించి ఉన్నవారు తప్పనిసరిగా ఇ-ఫైలింగ్ చేయాలి.
* ఆయా వ్యక్తుల వృత్తి, ఆదాయ మార్గాల ఆధారంగా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా పాన్ సంఖ్య, ఐటీఆర్ ఫారం-16, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, వ‌డ్డీకి సంబంధించిన పాస్‌బుక్‌ తదితరాలకు సంబంధించిన కాపీలను జత చేయాల్సి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.