యాప్నగరం

డబ్బు విత్‌డ్రాపై ట్యాక్స్! ఆధార్ తప్పనిసరి?

అధిక మొత్తంలోని నగదు విత్‌డ్రాకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ట్యాక్స్ రిటర్న్స్ పోల్చి చూడటం సులభతరమౌతుందని అంచనా.

Samayam Telugu 10 Jun 2019, 3:47 pm

ప్రధానాంశాలు:

  • నగదు విత్‌డ్రాపై పన్ను విధించాలనే యోచనలో కేంద్రం
  • అలాగే అధిక మొత్తంలోని లావాదేవీలకు ఆధార్ నెంబర్ తప్పనిసరి చేసే అవకాశం
  • బడ్జె్ట్ ముందు తెరపైకి కొత్త ప్రతిపాదనలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ATM
కేంద్ర ప్రభుత్వం నగదు విత్‌డ్రాయెల్‌పై పన్ను విధించాలని చూస్తోంది. ఒక ఏడాదిలో రూ.10 లక్షలు, ఆపైన విలువైన విత్‌డ్రాయెల్స్‌పై ట్యాక్స్ విధించాలని యోచిస్తోంది. నగదు వినియోగాన్ని తగ్గించడం, నల్లధనం కట్టడి, డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెంపు వంటి లక్ష్యాల్లో భాగంగా ఈ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే అధిక మొత్తంలోని నగదు విత్‌డ్రాకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ట్యాక్స్ రిటర్న్స్ పోల్చి చూడటం సులభతరమౌతుందని అంచనా. దీంతో రూ.50,000కు మించిన లావాదేవీలకు ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో డబ్బులు తీసుకునేందుకే ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియ అనుసరిస్తున్నారు. అలాంటిది రూ.5 లక్షలు విత్‌డ్రా చేసే వారికి ఇలాంటి నిబంధన లేకపోవడం ఎంటని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

జూలై 5న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంలో ఈ అంశం తెరమీదకు రావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.