యాప్నగరం

Pakistan : వేతన జీవులపై భారీగా పన్నులు పెంచిన పాక్ ప్రభుత్వం.. బాదుడే బాదుడు!

పాకిస్తాన్ ప్రభుత్వం పన్నుల బాదుడు షురూ చేసింది. ప్రస్తుతం ఎదుర్కొంటోన్న ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. గత రెండు రోజుల క్రితమే భారీ పరిశ్రమలపై సూపర్ ట్యాక్స్‌ను విధించిన పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా వేతన జీవులపై పన్ను విధింపులను పెంచింది. అంతేకాక ఇన్ని రోజులు కల్పించిన ఉపశమనాలను ఎత్తివేసింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 26 Jun 2022, 9:32 am

ప్రధానాంశాలు:

  • వేతన జీవులకు పన్నులను పెంచిన పాకిస్తాన్ ప్రభుత్వం
  • పన్ను ఉపశమనాలు కూడా విత్ డ్రా
  • రూ.235 బిలియన్ల పన్ను వసూళ్లు చేపట్టనున్న పాకిస్తాన్
  • మళ్లీ విద్యుత్ టారిఫ్‌లు పెంచేందుకు చర్చలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pakistan Tax Rates
వేతన జీవులకు పన్ను రేట్లు పెంచిన పాకిస్తాన్ ప్రభుత్వం
Pakistan : అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) నుంచి నిధులు పొందేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. రెండు రోజుల క్రితమే పెద్ద తరహా పరిశ్రమలపై సూపర్ ట్యాక్స్ ప్రకటించిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి సెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. తాజాగా వేతన జీవులకు కూడా షాకిచ్చింది. వేతన జీవులకు పన్ను రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. వేతన జీవులకు అందించిన పన్ను ఉపశమనాలను విత్ డ్రా చేసినట్టు తెలిపింది. దీంతో ఫెడరల్ బోర్డు రెవెన్యూ వసూళ్ల లక్ష్యం రూ.7,470 కోట్లకు పెరిగినట్టు గియో న్యూస్ తెలిపింది.
వ్యక్తిగత ఆదాయపు పన్ను పరంగా చూసుకుంటే.. తొలుత ఆ ప్రభుత్వం రూ.80 బిలియన్ల పన్ను మొత్తాలను పెంచింది. రూ.47 బిలియన్ల పన్ను ఉపశమనాలను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత వేతన జీవులకు రూ.35 బిలియన్ల పన్ను మొత్తాన్ని పెంచింది. ఇలా వచ్చే బడ్జెట్‌లో వేతన జీవుల నుంచి ప్రభుత్వం రూ.235 బిలియన్ల పన్ను వసూళ్లను చేపట్టాలని చూస్తోంది.

Also Read : వాహనం నడపాలంటే ఎంత ఖర్చుచేయాలి..? నేటి పెట్రోల్, డీజిల్ రేట్లెలా ఉన్నాయి..?
ఐఎంఎఫ్ డిమాండ్‌లను అన్నింటిన్ని తాము దాదాపు చేరుకున్నామని పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. నిధుల విషయంలో ఐఎంఎఫ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్‌లు చర్చలు జరుపుతున్నాయి. విద్యుత్ టారిఫ్‌లను మరింత పెంచే విషయంపై కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

అత్యధిక ఆదాయం సంపాదించే వారిపై పన్ను రేట్లను పెంచడంతో.. పేదరికాన్ని నిర్మూలించేందుకు రూ.120 బిలియన్లను ప్రభుత్వం సేకరిస్తోంది. అలాగే వేతన జీవులకు పన్ను రేట్లను పెంచడం ద్వారా రూ.35 బిలియన్లను సేకరిస్తోంది. ఇలా పలు కఠినమైన నిర్ణయాలను పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంటోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు ఈ కీలకమైన చర్యలను ప్రకటిస్తోంది.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read : Gold Price Today : నేటి మార్కెట్లో బంగారం, వెండి ధరలు.. పసిడి రేటు ఎంత పెరిగిందంటే..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.