యాప్నగరం

ఈ స్కీమ్‌తో సంవత్సరానికి రూ.2 లక్షలు ఆదా.. వారికే ఈ ఛాన్స్!

ఉద్యోగం చేస్తున్నారా? లేదంటే సొంతంగానే బిజినెస్ నిర్వహిస్తున్నారా? డబ్బు ఆదా చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాదికి రూ.2 లక్షల వరకు ఆదా చేసుకునే ఛాన్స్ ఉంది.

Samayam Telugu 10 Jan 2020, 12:26 pm
ఉద్యోగం చేస్తున్నారా? లేదంటే సొంతంగానే బిజినెస్ నిర్వహిస్తున్నారా? డబ్బు ఆదా చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాదికి రూ.2 లక్షల వరకు ఆదా చేసుకునే ఛాన్స్ ఉంది.
Samayam Telugu nps subscribers alert get deduction up to rs 2 lakh per year with national pension system rules explained
ఈ స్కీమ్‌తో సంవత్సరానికి రూ.2 లక్షలు ఆదా.. వారికే ఈ ఛాన్స్!


ట్యాక్స్ బెనిఫిట్స్

ఉద్యోగులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులు ఎన్‌పీఎస్ స్కీమ్‌పై పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. పీఎఫ్ఆర్‌డీఏ ప్రకారం.. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (1) కింద ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

Also Read: గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. వెండి ఢమాల్!

స్వయం ఉపాధి పొందుతున్న వారికి..

ఎన్‌పీఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే వారు వ్యాపారం చేస్తూ ఉంటే సెక్షన్ 80 సీసీడీ(1) కింద స్థూల ఆదాయం (బేసిక్, డీఏ)లో కంట్రిబ్యూషన్స్‌ ద్వారా 20 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ఈ పరిమితి దాటి మినహాయింపు లభించదు.
Also Read: పాన్ కార్డు ప్రతిఒక్కరికీ కచ్చితంగా ఉండాల్సిందేనా? లేకపోతే ఏమౌతుంది?

ఉద్యోగులకు ఇలా

ఉద్యోగం చేసే వారు కూడా ఎన్‌పీఎస్ స్కీమ్‌లో సబ్‌స్క్రైబర్లు అయితే వీరికి కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. కంట్రిబ్యూషన్‌పై శాలరీ (బేసిక్, డీఏ)లో 10 శాతం వరకు మినహాయింపు పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ(1) కింద ఈ ట్యాక్స్ తగ్గింపు లభిస్తుంది. ఈ మినహాయింపు రూ.1.5 లక్షల పరిమితిని దాటకూడదు.

Also Read: హోమ్ లోన్ ఏ బ్యాంక్‌లో తీసుకుంటే బెస్ట్? ఇక్కడైతే రూ.లక్షకు రూ.830 ఈఎంఐ!

అదనపు పన్ను ప్రయోజనాలు

ఎన్‌పీఎస్ స్కీమ్‌పై అదనపు పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఎన్‌పీఎస్ స్కీమ్‌పై అదనంగా మరో రూ.50,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద ఈ ఫెసిలిటీ పొందొచ్చు. ఈ మినహాయింపు రూ.1.5 లక్షలకు అదనం. అంటే ఎన్‌పీఎస్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.

Also Read: ట్రైన్ బయలుదేరడానికి అర గంట ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు! ఎలా అంటే?

ఎంప్లాయీస్‌కు మరో ఆప్షన్

ఎన్‌పీఎస్ అకౌంట్‌కు ఉద్యోగి సొంతంగానే కాకుండా కంపెనీ కూడా ఎన్‌పీఎస్ ఖాతాకు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఉద్యోగులు కంపెనీ ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్‌పై కూడా పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రస్తుత రూల్స్ ప్రకారం.. కంపెనీ కంట్రిబ్యూట్ చేసే 10 శాతాన్ని (బేసిక్, డీఏ) సెక్షన్ 80సీసీడీ(2) కింద ట్యాక్సబుల్ ఇన్‌కమ్ నుంచి డిడక్షన్ పొందొచ్చు. సెక్షన్ 80సీ, సెక్షన్ 80సీసీడీ(1బీ) మినహాయింపునకు ఇది అదనం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.