యాప్నగరం

దిగొచ్చిన ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం..

పెట్రోల్ ధర నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో మూడు వారాలుగా దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు. క్రూడ్ ధరలు మాత్రం ఈరోజు తగ్గాయి.

Samayam Telugu 25 Nov 2021, 3:12 pm

ప్రధానాంశాలు:

  • నిలకడగా పెట్రోల్
  • డీజిల్ కూడా ఇదే దారిలో
  • ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu petrol price today
దేశీ ఇంధన ధరల్లో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర స్థిరంగానే ఉంది. డీజిల్ రేటు కూడా నిలకడగానే కొనసాగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు మూడు వారాలుగా స్థిరంగానే ఉంటూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు.
హైదరాబాద్‌లో గురువారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. లీటరుకు పెట్రోల్ ధర రూ.108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.

Also Read: undefined

మరోవైపు ఆంధ్రప్రదేశ్ గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్ ధర ఇదే దారిలో నడిచింది. పెట్రోల్ రేటు లీటరుకు రూ.110.67 వద్దనే స్థిరంగా ఉంది. మార్పు లేదు. డీజిల్ రేటులో కూడా మార్పు లేదు. దీంతో డీజిల్ ధర రూ.96.08 వద్దనే ఉంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.21 శాతం క్షీణించింది. దీంతో బ్రెంట్ ధర 82.08 డాలర్లకు తగ్గింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. 0.26 శాతం తగ్గింది. దీంతో ఈ రేటు 76.19 డాలర్లకు క్షీణించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.