యాప్నగరం

షాక్.. రూ.3 వరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ పట్టణాల్లో రూ.100 దాటేసిన పెట్రోల్ రేటు!

పెట్రోల్, డీజిల్ ధరలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ రేటు 11 రోజుల్లోనే రూ.2.5 మేర పెరిగింది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ.2.75 వరకు పెరిగింది. దీంతో వాహనదారులపై ప్రభావం పడుతోంది.

Samayam Telugu 18 May 2021, 11:34 am

ప్రధానాంశాలు:

  • వాహనదారులకు ఝలక్
  • పెరిగిన పెట్రోల్ రేటు
  • డీజిల్ ధర కూడా ఇదే దారిలో

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu petrol
ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం బాదుడు ప్రారంభించింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ వస్తోంది. దేశీ ఇంధన ధరలు చూస్తుండంగానే పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్ ధర 28 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ రేటు లీటరుకు రూ.96.50కు ఎగసింది. అదే సమయంలో డీజిల్ రేటు కూడా పైకి కదిలింది. 31 పైసలు పెరుగుదలతో రూ.91.04కు ఎగసింది.

Also Read: undefined

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో పెట్రోల్ ధర 27 పైసలు పెరిగింది. దీంతో ఈ రేటు రూ.98.61కు ఎగసింది. అలాగే డీజిల్ ధర 31 పైసలు పెరిగింది. దీంతో డీజిల్ రేటు రూ.92.62కు ఎగసింది. దేశవ్యాప్తంగా చూస్తే ఇండోర్, భోపాల్, జైపూర్ పట్టణాల్లో పెట్రోల్ రేటు రూ.100 దాటేసింది.

పెట్రోల్ ధర గత 11 రోజుల్లో లీటరుకు రూ.2.5 మేర పెరిగింది. అదే సమయంలో డీజిల్ రేటు కూడా పెరిగింది. 11 రోజుల్లోనే డీజిల్ రేటు లీటరుకు రూ.2.78 మేర పైకి కదిలింది. పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.