యాప్నగరం

Petrol Price Today: మళ్లీ తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.85.98 కి చేరగా, డీజిల్ ధర రూ.81.36 వద్ద కొనసాగుతోంది.

Samayam Telugu 25 Oct 2018, 10:49 am
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం (అక్టోబరు 25) కూడా దిగొచ్చాయి. పెట్రోలు ధర 15 పైసలు, డీజిల్ ధరలు 5 పైసల మేర తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.81.10 కి చేరింది. డీజిల్ రూ.74.80 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.86.58 కి చేరింది. డీజిల్ ధర రూ.78.41 కి చేరింది. ఇక హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.85.98 కి చేరగా, డీజిల్ ధర రూ.81.36 వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu petrol


అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 76 డాలర్ల దిగువకు ట్రేడ్ అవుతోంది. ఈ నెలలో బ్యారెల్ ధర 86 డాలర్లకు ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే.

అక్టోబరు 25న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ రూ.81.10 రూ.74.80
ముంబయిరూ.86.58 రూ.78.41
కోల్‌కతారూ.82.95 రూ.76.65
చెన్నైరూ.84.28 రూ.79.09
బెంగళూరురూ.81.74 రూ.75.19
హైదరాబాద్ రూ.85.98 రూ.81.36

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.