యాప్నగరం

వాహనదారులకు ఝలక్.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

పెట్రోల్ ధర మళ్లీ పెరిగొచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పైపైకి చేరడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇదే జరిగితే వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

Samayam Telugu 7 Dec 2021, 12:06 pm

ప్రధానాంశాలు:

  • గ్లోబల్ మార్కెట్‌లో పరుగులు పెడుతున్న క్రూడ్
  • దీంతో దేశీ మార్కెట్‌లో ఇంధన ధరలపై ప్రభావం పడొచ్చు
  • ఈరోజు మాత్రం నిలకడగానే పెట్రోల్ రేటు
  • డీజిల్ ధర కూడా ఇదే దారిలో పయనించింది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu petrol price
వాహనదారులకు మళ్లీ ఝలక్ తప్పదా? పెట్రోల్ డీజిల్ రేట్లు మరోసారి పెరగనున్నాయా? అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు పెరిగిపోవడంతో దేశీ మార్కెట్‌లో మళ్లీ ఇంధన ధరలు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే మళ్లీ వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది.
ఇకపోతే పెట్రోల్, డీజిల్ రేట్లు ఈరోజు కూడా స్థిరంగానే ఉన్నాయి. దేశంలో ఈరోజు కూడా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు. పెట్రోల్ ధర ఈ నెల ఆరంభం నుంచి స్థిరంగానే కొనసాగుతూ వచ్చింది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో పయనించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంధన ధరలు వారం రోజులుగా నిలకడగానే ఉన్నాయని గమనించాలి.

Also Read: undefined

హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ Petrol ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ రేటు స్థిరంగా ఉంది. లీటరుకు పెట్రోల్ ధర రూ.108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్ ధర ఇదే దారిలో నడిచింది. రేటులో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ రేటు లీటరుకు రూ.110.67 వద్దనే స్థిరంగా ఉంది. డీజిల్ Diesel రేటులో కూడా మార్పు లేదు. దీంతో డీజిల్ ధర రూ.96.08 వద్దనే కొనసాగుతోంది.

Also Read: undefined

గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు Crude Oil ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.22 శాతం పైకి కదిలింది. దీంతో బ్రెంట్ ధర 74 డాలర్లకు ఎగసింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర కూడా పైకి చేరింది. 1.51 శాతం పెరిగింది. దీంతో ఈ రేటు 70.55 డాలర్లకు ఎగసింది.

కాగా భారత్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతుంది. అందువల్ల క్రూడ్ ధరలు పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాల వల్ల కూడా దేశీ ఇంధన ధరలపై ఎఫెక్ట్ ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.