యాప్నగరం

Petrol Price Today: పెట్రోలు ధ‌ర పెరిగింది.. డీజిల్ ధ‌ర త‌గ్గింది

హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ.74.60, డీజిల్ ధర 7 పైసలు తగ్గి రూ.70.10 కి చేరింది.

Samayam Telugu 18 Dec 2018, 5:28 pm
ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను మరోసారి సవరించాయి. దీంతో శనివారం (డిసెంబరు 15న) దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు స్వల్పంగా పెరగ్గా.. డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 5 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.82.26 కి చేరింది. డీజిల్ ధర 7 పైసలు తగ్గి రూ.64.50 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 5 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.75.96 కి చేరింది. డీజిల్ ధర 8 పైసలు తగ్గి రూ.67.50 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ 60.28 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 51.20 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu petrol


ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్నికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ.74.60, డీజిల్ ధర 7 పైసలు తగ్గి రూ.70.10 కి చేరింది. విజయవాడలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.74.10, డీజిల్ ధర రూ.69.24గా ఉంది.

డిసెంబరు 15న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీరూ.70.34రూ.64.50
ముంబయి రూ.75.96 రూ.67.50
కోల్‌కతారూ.72.43రూ.66.26
చెన్నైరూ.72.99రూ.68.10
బెంగళూరు రూ.70.91రూ.64.86
హైదరాబాద్ రూ.74.60 రూ.70.10
విజయవాడ రూ.74.10రూ. 69.24

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.