యాప్నగరం

Today Petrol Price: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా!

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.42 శాతం తగ్గుదలతో 64.18 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.14 శాతం తగ్గుదలతో 57.82 డాలర్లకు దిగొచ్చింది.

Samayam Telugu 25 Jun 2019, 6:44 pm

ప్రధానాంశాలు:

  • నిలకడగానే పెట్రోల్ ధర
  • డీజిల్ ధరదీ ఇదే దారి
  • ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి
  • గ్లోబల్ మార్కెట్‌లో తగ్గిన క్రూడాయిల్ ధర

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu PETROL
దేశీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగాయి. వరుస రెండు రోజుల పెరుగుదల తర్వాత మంగళవారం (జూన్ 25) పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.74.45 వద్ద, డీజిల్ ధర రూ.69.64 వద్ద ఉంది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి.
అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్‌ ధర రూ.74.24 వద్ద, డీజిల్‌ ధర రూ.69.09 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.73.89 వద్ద, డీజిల్ ధర రూ.68.77 వద్ద ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.70.05 వద్ద, డీజిల్ ధర రూ.63.90 వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.75.75 వద్ద, డీజిల్ ధర రూ.66.99 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.42 శాతం తగ్గుదలతో 64.18 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.14 శాతం తగ్గుదలతో 57.82 డాలర్లకు దిగొచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.