యాప్నగరం

పెట్రోల్ ధర పైపైకి.. 20 రోజులుగా ఆగని దూకుడు

సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి.

Samayam Telugu 26 Jun 2020, 8:52 am
వాహన వినియోగదారులకు చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశీ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 20 రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నా.. రెండు రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న నిలకడగా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు మళ్లీ పైకి కదిలాయి. దీంతో హైదరాబాద్‌‌లో గురువారం లీటరు పెట్రోల్ ధర రూ. 83.18, డీజిల్‌ ధర రూ.78.36 పైసలు.
Samayam Telugu పెట్రోల్ ధరల పెరుగుదల
petrol rates hike


అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 22 పైసలు పెరిగింది. దీంతో ధర రూ.83.53కు చేరింది. డీజిల్‌ ధర కూడా 17 పైసలు పెరుగుదలతో రూ.78.67కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర లీటర్ రూ.83.13కు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్ రూ.78.30కు ఎగసింది.

వరుసగా 20వ రోజూ కూడా చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 21పైసలు, డీజిల్‌ లీటర్‌కు 17 పైసలు పెంచాయి. 20రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌కు రూ.8.93పైసలు, డీజిల్‌ లీటర్‌కు రూ.10.07పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 80.13 పైసలు, డీజిల్‌ ధర 80.19, చెన్నైలో పెట్రోల్‌ రూ. 83.37, డీజిల్‌ ధర రూ.77.44పైసలు పెరిగాయి. కోల్‌కతాలో పెట్రోల్‌ లీటర్‌కు రూ. 81.82, డీజిల్‌ ధర రూ.75.34 పైసలు పెరిగాయి. ముంబైలో పెట్రోల్‌ రూ. 86.91, డీజిల్‌ ధర రూ.78.51 పైసలుగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.