యాప్నగరం

Petrol Price Today: రికార్డు స్థాయికి చేరిన పెట్రోలు, డీజిల్ ధరలు

ముంబయిలో 34 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.90కి కేవలం 99 పైసల దూరంలో నిలిచింది.

Samayam Telugu 15 Sep 2018, 10:44 am
పెట్రోల్‌, డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శనివారం (సెప్టెంబరు 15) కూడా ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో ఢిల్లీలో 35 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.81.63కి చేరింది. మరోవైపు డీజిల్ ధర 24 పైసలు పెరిగి రూ. 73.54కి చేరింది. ముంబయిలో 34 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.90కి కేవలం 99 పైసల దూరంలో నిలిచింది. డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.78.07కు చేరింది. సెప్టెంబరు 5, సెప్టెంబరు 12 మినహా గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి . ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్‌పై రూ. 4.83, డీజిల్‌పై రూ.5 పెరిగింది.
Samayam Telugu fuel


శనివారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరల వివరాలు:
నగరంపెట్రోలు (లీటర్ ధర) డీజిల్ (లీటర్ ధర)
ఢిల్లీరూ.81.63 రూ.73.54
ముంబయి రూ.89.01 రూ.78.07
కోల్‌కతా రూ.83.49రూ.75.39
బెంగళూరు రూ.84.30 రూ.75.91
చెన్నైరూ.84.85 రూ.77.74
హైదరాబాద్ రూ.86.18 రూ.79.73
విజయవాడ రూ. 85.41 రూ.78.63

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.