యాప్నగరం

రోజుకు రూ.200 మించి పెట్రోల్ కొట్టించలేం.. అక్కడ కొత్త రూల్స్.. నేటి ఫ్యూయెల్ రేట్లు ఇవే!

పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఫ్యూయెల్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. దేశ వ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో కూడా ముడి చమురు ధరలు మిశ్రమంగా ఉన్నాయి. అయితే త్రిపురలో మాత్రం ఫ్యూయెల్ వినియోగంపై పరిమితులు విధించారు. రోజుకు రూ. 200కు మించి పెట్రోల్ కొట్టించుకోవడానికి అవకాశం లేదు. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారని చెప్పుకోవాలి.

Authored byKhalimastan | Samayam Telugu 20 May 2022, 7:32 am

ప్రధానాంశాలు:

  • శ్రీలంక తరహాలో మన దేశంలోని ఒక రాష్ట్రంలో ఫ్యూయెల్ కొరత
  • అందువల్ల పెట్రోల్, డీజిల్ వినియోగంపై పరిమితులు
  • రోజుకు రూ.200కు మించి పెట్రోల్ కొట్టించడం కుదరదు
  • ఇకపోతే ఈరోజు ఫ్యూయెల్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu fuel rates
శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకందరికీ తెలుసు. అక్కడ పెట్రోల్, డీజిల్ నిల్వలు అయిపోయాయి. క్రూడ్ ఆయిల్ కొనేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు కూడా లేవు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన దేశంలోని ఒక రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర కూడా ఇంధన సంక్షోభంతో సతమతమవుతోంది. ఫ్యూయెల్ నిల్వలు తగ్గిపోవడం వల్ల ఇంధన వినియోగంపై పరిమితులు విధించింది. అస్సాంలోని 29 జిల్లాలను వరద నీరు ముంచెత్తడంతో ఆర్టీరియల్ రైల్వే లైన్, రోడ్లు తెగిపోవడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
దీంతో పెట్రోల్, డీజిల్ వినియోగంపై పరిమితులు వచ్చాయి. ద్విచక్ర వాహన యజమానులు రోజుకు రూ.200 విలువైన ఇంధనాన్ని మాత్రమే పొందవచ్చని ఇటీవలి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే త్రివీలర్ వాహన యజమానులకు ఫ్యూయెల్ లిమిట్ రూ.300కి పరిమితం చేశారు. అదే ఫోర్ వీలర్ యజమానులు రోజుకు రూ.1,000 వరకు ఇంధనం కొనుగోలు చేయవచ్చు. బుధవారం నుంచే ఈ రూల్ అమలులోకి వచ్చిందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఇదే నిబంధనలు అమలులో ఉంటాయి. దీంతో ప్రజలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు.

Also Read: undefined

ఇకపోతే దేశవ్యాప్తంగా ఫ్యూయెల్ రేట్లు మే 20న కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.119.47 వద్దనే కొనసాగుతూ వస్తోంది. డీజిల్ కొనాలంటే రూ.105.47 చెల్లించుకోవాలి. వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.118.97గా, డీజిల్ రేటు రూ.105గా ఉంది. ఏపీ గుంటురూలో పెట్రోల్, డీజిల్ రేట్లు వరుసగా రూ.121.26, రూ.106.87 వద్ద ఉన్నాయి. వైజాగ్‌లో ఈ రేట్లు రూ.119.98 వద్ద, రూ.105.63 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.12 శాతం పెరిగాయి. 111.57 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర మాత్రం 0.56 శాతం పడిపోయింది. దీంతో దీని రేటు బ్యారెల్‌కు రూ.109.26 వద్ద కదలాడుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ రేట్లు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేస్తాయనే విషయం మనకు తెలిసిందే.

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.