యాప్నగరం

Petrol Price Today: మళ్లీ తగ్గిన పెట్రోలు ధరలు

హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 7పైసలు తగ్గి రూ.74.02 వద్ద, డీజిల్ ధర రూ.69.37 వద్ద కొనసాగుతోంది.

Samayam Telugu 25 Dec 2018, 10:59 am
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనం కావడంతో.. దేశీయ ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఇంధన ధరలను మరోసారి సవరించాయి. దీంతో మంగళవారం (డిసెంబరు 25) దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు స్వల్పంగా తగ్గగా.. డీజిల్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర 7 పైసలు తగ్గి రూ.69.79కి చేరగా.. డీజిల్ ధర 63.83 వద్వే ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 7 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.75.41 ఉండగా.. డీజిల్ ధర రూ.66.79 వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu petrol


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పతనం కొనసాగుతూనే ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ 50.77 డాలర్లకు చేరగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 42.53 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్నికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 7పైసలు తగ్గి రూ.74.02 వద్ద, డీజిల్ ధర రూ.69.37 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 8 పైసలు తగ్గి రూ.73.54 ఉండగా, డీజిల్ ధర రూ.68.54 వద్దే స్థిరంగా ఉంది.

డిసెంబరు 25న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరంపెట్రోలు ధర (లీటర్)డీజిల్ ధర (లీటర్)
ఢిల్లీ₹ 69.79₹ 63.83
ముంబయి₹ 75.41₹ 66.79
కోల్‌కతా₹ 71.89₹ 65.59
చెన్నై₹ 72.41₹ 67.38
బెంగళూరు₹ 70.35₹ 64.18
తిరువనంతపురం₹ 72.98₹ 68.64
హైదరాబాద్₹ 74.02₹ 69.37
విజయవాడ₹ 73.54₹ 68.54

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.