యాప్నగరం

Petrol Diesel Demand: గ్యాస్ సిలిండర్ అమ్మకాలు డౌన్.. పడిపోయిన డీజిల్ డిమాండ్!

Today Petrol Rate: దేశంలో పెట్రోల్ వినియోగం దాదాపు ఫ్లాట్‌గానే ఉంది. డీజిల్ వినియోగం మాత్రం పడిపోయింది. అలాగే ఎల్‌పీజీ గ్యాస్ అమ్మకాలు కూడా క్షీణించాయి. నెలవారీగా చూస్తే ఈ విధంగా క్షీణత కనిపించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు కూడా ఫ్యూయెల్ రేట్లలో మార్పు లేదు. మరో వైపు గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

Authored byKhalimastan | Samayam Telugu 17 Aug 2022, 7:35 am

ప్రధానాంశాలు:

  • పెట్రోల్ డిమాండ్ తగ్గింది.. డీజిల్ ఇదే దారిలో
  • ఈ రోజు కూడా ఫ్యూయెల్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు
  • నిలకడగానే కొనసాగుతూ వస్తున్న పెట్రోల్ ధర
  • గ్లోబల్ మార్కెట్‌లో చెరోదారిలో ముడి చమురు రేట్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu lpg cylinder
గ్యాస్ సిలిండర్ అమ్మకాలు డౌన్
Petrol Prices: దేశంలో డీజిల్ వినియోగం తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో నెల కూడా డీజిల్ డిమాండ్ పడిపోయింది. జూలై నెలలో పెట్రోల్, డీజిల్ రెండింటి వినియోగం కూడా దిగి వచ్చింది. అయితే ఆగస్ట్ నెల తొలి అర్ధ భాగంలో మాత్రం పెట్రోల్ వినియోగం దాదాపు ఫ్లాట్‌గానే ఉంది. అయితే డీజిల్ వినియోగం మాత్రం తగ్గింది. 11.2 శాతం పడిపోయింది. ఆగస్ట్ 1 నుంచి 15 వరకు చూస్తే.. డీజిల్ వినియోగం 2.82 మిలియన్ టన్నులుగా ఉంది. గత నెల ఇదే సమయంలో డీజిల్ వినియోగం 3.17 మిలియన్ టన్నులుగా నమోదు అయ్యింది.
రుతుపవనాల రాక, తీవ్రత అనే అంశాలు దేశంలో డీజిల్ డిమాండ్‌పై అధిక ప్రభావం చూపిస్తాయి. సాధారణంగానే ఏప్రిల్- జూన్ కన్నా జూలై- సెప్టెంబర్‌లో డీజిల్ వినియోగం తక్కువగా ఉంటుంది. రుతుపవనాలు రాకతో వర్షాలు కురవడం వల్ల నీటి పారుదల పంపులు వినియోగం తగ్గుతుంది. తద్వారా వ్యవసాయ రంగంలో డీజిల్‌ డిమాండ్ తగ్గుతుంది. అయితే డీజిల్ డిమాండ్ మాత్రం వార్షికంగా చూస్తే 32.8 శాతం మేర పెరిగింది. 2021లో లో బేస్ ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే 2020 ఆగస్ట్ 1 నుంచి 15 వరకు చూస్తే.. డీజిల్ డిమాండ్ ఇప్పుడు 58 శాతం మేర పైకి చేరింది. ఇంకా 2019తో పోలిస్తే.. ఇప్పుడు డీజిల్ వినియోగం 23 శాతం పెరిగింది. అలాగే వార్షికంగా చూస్తే ఎల్‌పీజీ గ్యాస్ వినియోగం 8.19 శాతం పెరిగింది. 1.14 మిలియన్ టన్నులకు చేరింది. నెలవారీగా చూస్తే మాత్రం ఎల్‌పీజీ వినియోగంలో కూడా క్షీణత కనిపించింది. 7.8 శాతం తగ్గుదల నమోదు అయ్యింది.

మరోవైపు ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు రూ. 109.64 వద్ద, డీజిల్ రేటు రూ. 97.8 వద్ద ఉన్నాయి. కర్నూల్‌లో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 112.1 వద్ద ఉంది. డీజిల్ రేటు రూ. 99.83 వద్ద కొనసాగుతోంది. గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 111.74గా, రూ. 99.49గా ఉన్నాయి. విశాఖ పట్నంలో పెట్రోల్ కొనాలంటే రూ. 110.46, డీజిల్ కోసం రూ. 98.25 చెల్లించుకోవాలి. కాగా ముడి చమురు ధరలు చెరోదారిలో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు 0.41 శాతం క్షీణతతో బ్యారెల్‌కు 92.31 డాలర్ల వద్ద కదలాడుతోంది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ రేటు 0.06 శాతం పైకి చేరింది. దీంతో ఈ క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్‌కు 86.61 డాలర్ల వద్ద ఉంది.

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.