యాప్నగరం

Multibagger Stocks: దుమ్మురేపిన మల్టీబ్యాగర్.. ఇందులో డబ్బులు పెడితే రెట్టింపు లాభం..!

Multibagger Stocks: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం కాస్త రిస్క్‌తో కూడుకున్నదే. అయితే మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ ఇన్వెస్ట్ చేస్తుంటే మంచి లాభాలను అందుకోవచ్చు. ముఖ్యంగా మల్టీబ్యాగర్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తుంటాయి. అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి మనం ఇప్పుడు చూద్దాం.

Authored byపూర్ణచందర్ తూనం | DSIJ 10 Jan 2023, 1:54 pm
Multibagger Stocks: మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి వినే ఉంటారు. ఇవి తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందిస్తుంటాయి. అసలైన షేరు విలువకు ఎన్నో రెట్లు పెరిగితే దానిని మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ముందే గుర్తించడం కాస్త కష్టమే అయినప్పటికీ స్టాక్ మార్కెట్లపై పట్టు ఉన్నవారికి ఇది తేలికే. ఇందుకోసం స్టాక్ మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, పనితీరు, ప్రణాళికలు ఇవన్నీ ఫాలో అవుతుంటే.. మల్టీబ్యాగర్ స్టాక్స్‌ ఏవో తెలుసుకోవచ్చు. ఇవి ఇన్వెస్టర్లకు మంచి లాభాలు ఇస్తుంటాయి. స్టాక్ మార్కెట్లలో మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలానే ఉంటాయి. అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది రెండేళ్లలో ఇన్వెస్టర్ల సంపదను 120 శాతం పెంచింది.
Samayam Telugu MULRIBAGGER STOCKS


గణేశ్ బెంజోప్లాస్ట్ లిమిటెడ్ (Ganesh Benzoplast Limited). ఇది ఒక కెమికల్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీనిని 1974లో స్థాపించారు. లిక్విడ్ స్టోరేజీ ట్యాంక్స్ డివిజన్, కెమికల్ డివిజన్ అని రెండు సెగ్మెంట్లలో ఇది నిమగ్నమై ఉంది. ఈ కంపెనీకి ఉన్న మంచి డిమాండ్‌తో ఇటీవలి కాలంలో స్టాక్ ధర భారీగా పెరిగింది.

పర్సనల్ లోన్ అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సినవి ఇవే.. ఇలా చేయకపోతే..

2021 జనవరి 6న గణేశ్ బెంజోప్లాస్ షేరు ధర రూ.61.50 వద్ద ఉండగా.. 2023 జనవరి 6న అది రూ.137.10 కి చేరింది. అంటే ఈ రెండేళ్ల హోల్డింగ్ పీరియడ్‌లో 120 శాతం పెరిగింది. ఇన్వెస్టర్లకు ఇంత లాభం వచ్చిందన్నమాట. మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్ సొంతమయ్యాయి. అయితే ఇదే సమయంలో S&P BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 55 శాతం మాత్రమే పెరిగింది.

రెండు సార్లు చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన అదానీ.. సక్సెస్‌కు కారణమదే అంటూ..!

ఇక ఏకీకృత ప్రాతిపదికన ఈ కంపెనీ నికర ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరం ఇటీవలి త్రైమాసికంలో 17.33 శాతం మేర పెరిగి రూ.95.8 కోట్లుగా నమోదైంది. బాటమ్ లైన్ కూడా 214 శాతం పెరగడం విశేషం. ఇది రూ.13.5 కోట్లుగా నమోదైంది. కంపెనీ ROE, ROCE కూడా వరుసగా 13.1 శాతం, 16.4 శాతంగా ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.852.45 కోట్లుగా ఉంది.

పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా? వడ్డీ ఏ బ్యాంకులో తక్కువ?

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్‌లో భారీగా నష్టపోతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 700 పాయింట్ల పతనంతో 60 వేల 40 మార్కు వద్ద ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 220 పాయింట్లు కోల్పోయి 17 వేల 880 వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్, హిందాల్కో, ఓఎన్‌జీసీ, దివీస్ ల్యాబ్స్ రాణిస్తుండగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, గ్రేసిమ్ పడిపోయాయి. ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్లు ఇవాళ భారీగా పడిపోయాయి.
భారతదేశపు నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. విన్నింగ్ స్టాక్స్, సిఫార్సులకు సంబంధించిన అప్‌డేట్స్ క్రమం తప్పకుండా పొందడం కోసం ఈ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.


Also Read: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ధర.. తులం ఎంతంటే?

లక్షను రూ.55 లక్షలు చేసిన రూపాయి షేరు.. ఏడాదిలోనే ఇన్వెస్టర్ల దశ తిరిగింది..
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.