యాప్నగరం

Multibagger Stock: ఒకప్పటి 22 పైసల షేరు.. ఏడాదిలోనే లక్షకు రూ.53 లక్షల రిటర్నులు ఇచ్చింది..!

కొన్ని స్టాక్స్ మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి. చెప్పుకోవడానికి పెన్నీ స్టాక్స్ అయినా మల్టిబ్యాగర్ రిటర్నులను అందజేస్తున్నాయి. అలాంటి పెన్నీ స్టాక్స్‌లో ఒకటే రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్. ఈ పెన్నీ స్టాక్ ఏడాది వ్యవధిలోనే తన ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపించింది. నెల క్రితం ఈ స్టాక్‌లో డబ్బులు పెట్టిన లక్షకు రూ.రెండున్నర లక్షలు జేబులో వేసుకునే వాళ్లు. ఇక ఏడాది క్రితం ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన వారైతే భారీగా 5 వేల శాతానికి పైగా రిటర్నులను పొందారు.

Authored byKoteru Sravani | Samayam Telugu 22 May 2022, 12:27 pm

ప్రధానాంశాలు:

  • రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ మల్టిబ్యాగర్ రిటర్నులు
  • 5 వేల శాతానికి పైగా పెరిగిన షేరు ధర
  • 22 పైసల నుంచి రూ.11కి పైగా పెరిగిన షేరు
  • నెలకే లక్షకు రూ.రెండున్నర లక్షలకు పైగా లాభం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Multibagger Stock
Multibagger Stock: త్వరగా మనీ సంపాదించుకోవాలి.. బాగా సెటిల్ కావాలి అనుకునే వాళ్లకి స్టాక్ మార్కెట్ అనేది ఒక ఉత్తమమైన మార్గం. మీరు సరియైన షేర్లను ఎంచుకుంటే తక్కువ సమయంలోనే, తక్కువ డబ్బుతో ఎక్కువ లాభాలను పొందవచ్చు. స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ ధర కేవలం పైసల్లోనే ఉంటుంది. కానీ కొన్ని నెలల్లో లేదా ఏడాది కాలంలో ఇవి ఇచ్చే రిటర్నులు అద్భుతంగా ఉంటున్నాయి. అలాంటి స్టాక్స్‌లో ఒకటే రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్. ఈ పెన్నీ స్టాక్ ధర ఏడాది క్రితం కేవలం 22 పైసలు మాత్రమే. ప్రస్తుతం రూ.11న పైన ఈ షేరు ట్రేడవుతోంది.
శుక్రవారం బీఎస్ఈలో రాజ్ రేయాన్ ఇండస్ట్రీ షేరు ధర 5 శాతం లాభంలో రూ.11.86 వద్ద ముగిసింది. 2021 మే 24న ఈ కంపెనీ షేరు ధర ఒక్కోటి 22 పైసల వద్ద ట్రేడైంది. అప్పటి నుంచి ఈ షేర్లు పెరుగుతూనే ఉన్నాయి. ఏడాది సమయంలో తన ఇన్వెస్టర్లకు రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ 5,290.91 శాతం రిటర్నులను ఇచ్చింది. అదేవిధంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 778 శాతానికి పైగా ఈ షేరు పెరిగింది. గత నెలలో రూ.4.77 వద్ద ఉన్న షేర్లు ప్రస్తుతం రూ.11.86కి పెరిగాయి. అంటే నెలలోనే 150 శాతం మేర ఈ స్టాక్ పెరిగిది. గత ఐదు ట్రేడింగ్ సెషన్స్‌లోనే రాజ్ రేయాన్ షేర్లు తన ఇన్వెస్టర్లకు 21 శాతానికి పైగా రిటర్నులను అందించాయి.

ఏడాది క్రితం ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన వారికి 5 వేల శాతానికి పైగా రిటర్నులు అందాయి. అంటే ఏడాది క్రితం ఈ కంపెనీలో లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టి.. అమ్మకుండా ఉంటే.. ప్రస్తుతం వీటి నుంచి రూ.53.90 లక్షలను పొందేవారు. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుతం వారికి రూ.8.78 లక్షల వస్తాయి. నెలలోనే ఈ కంపెనీ ఇన్వెస్టర్లు లక్షకు రూ.రెండున్నర లక్షల వరకు రిటర్నులను పొందుతున్నారు.

Also Read : పెన్షనర్లకు అలర్ట్.. ఇంకా 3 రోజులే సమయం, లేదంటే పెన్షన్ కట్!

Also Read : Gold Price Today : మళ్లీ మెరిసిన బంగారం, తులం ఎంత పెరిగిందంటే..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.